YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విదేశీయం

రోల్స్ రాయిస్ ఎల‌క్ట్రిక‌ల్ విమానాలు

రోల్స్ రాయిస్ ఎల‌క్ట్రిక‌ల్ విమానాలు

లండ‌న్‌, అక్టోబ‌రు 8, 
మొట్ట మొదటి ఎలెక్ట్రిక్ విమానాన్ని తీసుకుని రాబోతోంది రోల్స్ రాయిస్. మొత్తం విద్యుత్ మీదనే ఈ విమానం పని చేయనుంది. 'అయన్ బర్డ్' అనే పేరును ఈ విమానానికి పెట్టారు. ఇటీవలే ఈ విమానం టెస్టింగ్ ను పూర్తీ చేసింది. ప్రపంచంలోనే వేగంగా ప్రయాణించగల ఎలెక్ట్రిక్ విమానంగా దీనికి పేరు ఉంది. రోల్స్ రాయిస్ సంస్థ 'యాక్సెలరేటింగ్ ది ఎలెక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్' అనే ప్లాన్ లో భాగంగా ఈ విమానాన్ని రూపొందించింది. ఎలెక్ట్రిక్ మోటర్ అండ్ కంట్రోలర్ మ్యానుఫ్యాక్చర్ సంస్థ అయిన యాసా కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉందని రోల్స్ రాయిస్ తెలిపింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఈ ప్రాజెక్టును ప్రాజెక్టును పూర్తీ చేస్తోంది రోల్స్ రాయిస్ సంస్థ. సాధారణంగా విమానాలను ఐరన్ బర్డ్స్ అని అంటూ ఉంటారు.. కానీ ఈ విమానం జీరో ఎమిషన్ ఎనర్జీతో ఉన్న కారణంగా అయన్ బర్డ్ అని పిలుస్తూ ఉన్నారు. 2050 లోపు జీరో కార్బన్ లిస్టుకు చేరడమే తమ సంస్థ లక్ష్యమని రోల్స్ రాయిస్ ఎలెక్ట్రికల్ డైరెక్టర్ రాబ్ వాట్సన్ చెప్పుకొచ్చారు. ఈ విమానం కోసం గ్రౌండ్ టెస్టింగ్ ను పూర్తీ చేయడం గొప్ప అఛీవ్ మెంట్ గా భావిస్తూ ఉన్నామని అన్నారు. తాము రాబోయే కాలానికి ఎలెక్ట్రికల్ విమానాలను తీసుకుని వచ్చే ప్రయత్నం ఇదని అంటున్నారు.  500 హార్స్‌ పవర్‌ సామర్థ్యం కలిగి ఉండడంతో ఈ విద్యుత్‌ విమానం రికార్డు స్థాయి వేగాన్ని క్షణాల్లో అందుకోగలదని రోల్స్‌ రాయిస్‌ డైరెక్టర్‌ రాబ్‌ వాట్సన్‌ వివరించారు. కాగా ఈ విమానం టెక్నాలజీని పరీక్షించేందుకు ఉపయోగించిన విద్యుత్‌‌ 250 ఇళ్లకు వినియోగించే ఎలక్ట్రిసిటీతో సమానమని రోల్స్ రాయిస్ ఇంజనీర్లు స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో సోషల్‌ డిస్టెన్స్‌ నిబంధనలకు అనుగుణంగానే అన్ని జాగ్రత్తలూ తీసుకుని టెస్ట్ నిర్వహించామని వాట్సన్ చెప్పారు.టెక్నాలజీ టెస్ట్‌ విజయవంతంగా పూర్తవడంతో అతి త్వరలోనే అన్ని పరికరాలనూ విమానంలో అమర్చుతామని తెలిపారు. 2050 నాటికి కాలుష్య రహిత విమానాల తయారీలో ముందు ఉండబోతున్నామని అన్నారు

Related Posts