హైద్రాబాద్, అక్టోబరు 8,
మలయాళంలో విజయంతమైన `అయ్యప్పనుమ్ కోషియమ్` సినిమాను తెలుగులో రీమేక్ కాబోతోంది. ఆ సినిమా రైట్స్ దక్కించుకున్న సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ముందుగా నందమూరి బాలకృష్ణతో తెరకెక్కేందుకు ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. కారణం తెలీదు గానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిన పవన్ కళ్యాణ్ లైన్లోకి వచ్చారు. ఈ సినిమా రీమేక్‌లో నటించేందుకు పవన్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మరో యంగ్ హీరో పాత్రకు దగ్గుబాటి రానాను సంప్రదించినట్లు తెలుస్తోంది.పవన్‌తో కలిసి నటించేందుకు రానా ఓకే చెప్పేయడంతో నిర్మాణ సంస్థ ఇతర టెక్నీషియన్లను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌ను డీల్ చేయగల సత్తా ఏ డైరెక్టర్‌కు ఉందోనని నిర్మాతలు జల్లెడ పడుతున్నారట. అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని వంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. పవర్‌స్టార్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని ఎందరో దర్శకులు ఎదురు చూస్తుంటారు. మరి ఈ అవకాశం ఏ డైరెక్టర్ ఎగరేసుకునిపోతాడో చూడాలి.