YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పార్టీ యాక్టివ్ అవుతుందా?

పార్టీ యాక్టివ్ అవుతుందా?

గుంటూరు‌, అక్టోబ‌రు 9, 
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పూర్తిగా ఇబ్బంది పడుతుంది. క్యాడర్ ఉన్నా నాయకులు యాక్టివ్ గా లేకపోవడంతో స్తబ్దుగా ఉంది. తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను చంద్రబాబు నియమించారు. దీంతోనైనా పార్టీ యాక్టివ్ అవుతుందా? అంటే సందేహమేనంటున్నారు. తాము ఆశించిన వారు కాకుండా మరొకరికి పదవి దక్కడం కూడా ఒక కారణం కాగా, పిలుపుకు క్యాడర్ ఉరుకులు పెట్టే నేతలను ఎంపిక చేయలేదన్న విమర్శలు ఉన్నాయి.ప్రకాశం జిల్లాను తీసుకుంటే ఇక్కడ నూకసాని బాలజీని నియమించారు. మొన్నటి వరకూ దామచర్ల జనార్థన్ ఉండేవారు. ఆయన ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన నేత కావడంతో పార్టీ కార్యక్రమాలు సక్సెస్ అయ్యేవి. అయితే ఇప్పుడు నూకసాని బాలాజీ పిలుపునకు ఎవరు స్పందిస్తారన్న చర్చ పార్టీలోనే జరుగుతుంది. క్యాడర్ కూడా దూకుడుగా ముందుకు రాదు. సామాజిక పరంగా చూసి నాయకత్వాన్ని నియమిస్తే సహకరించేవారుండరన్న వ్యాఖ్యలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.ఇక కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించారు. ఈయనతో కూడా కలసి వచ్చే నేతలు తక్కువనే చెప్పాలి. కర్నూలు పార్లమెంటు పరిధిలో కర్నూలు సిటీ ఇన్ ఛార్జి టీజీ భరత్ తప్పించి ఈయన నియామకాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. పైగా ప్రస్తుతం కర్నూలు జిల్లాలో టీడీపీ జీరో స్థాయిలో ఉంది. జీరో స్థాయి నుంచి మళ్లీ యాక్టివేట్ చేయాలంటే సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్థాయి సరిపోదనే వారు ఎక్కువగా ఉన్నారు.
ఇక విశాఖ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ రాజధాని వస్తుందన్న వైసీపీ ప్రభుత్వం ప్రకటనతో టీడీపీ నేతలు జారుకుంటున్నారు. విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నా ఒక్కరూ యాక్టివ్ గా లేరు. ఈ పరిస్థితుల్లో పల్లా శ్రీనివాస్ కు పార్లమెంటరీ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పల్లా నాయకత్వం సరిపోదంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరు బాధ్యతలు చేపట్టినా సరే కాని విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం బలమైన నేతలు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. లేకుంటే పార్టీ ఎదగడం కష్టమే అవుతుంది. ఇలాంటి సమయంలో సామాజికవర్గాల సమతూకాన్ని చూడటం కూడా సరైన చర్య కాదనే వారు పార్టీలో కన్పిస్తున్నారు.

Related Posts