YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స‌రిహ‌ద్దు జిల్లాల్లో ప‌క్క రాష్ట్రాల‌కు అబ్కారీ ఆదాయం

స‌రిహ‌ద్దు జిల్లాల్లో  ప‌క్క రాష్ట్రాల‌కు అబ్కారీ ఆదాయం

క‌ర్నూలు, అక్టోబ‌రు 9, 
నందమూరి నటసింహం బాలయ్య బాబు విలువ అమాంతం పెరిగింది. మార్కెట్లో ఎవరు ఉహించలేనంత ఎత్తుకు బాలయ్య బ్రాండ్ విషయంలో ఎదిగాడు. ఏడాదిలోనే తన మార్కెట్ విలువకు ఏకంగా మూడు రెట్లు వాల్యూ పెరిగింది. బ్రాండ్ వాల్యూ పెరిగినా బాలయ్య అభిమానులకు మాత్రం ఆ సంతోషం దక్కడం లేదు. బాలయ్య వాల్యూ ఏమో కానీ మాకు. మాత్రం సరదా తీరిపోతుందని బాధ పడుతున్నారు. బాలయ్య బ్రాండ్ వాల్యూ పెరగడానికి అభిమానులు బాధ పడటానికి ఓ కారణం ఉంది.కొత్త పాలసీ పుణ్యమాని ఏపీలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. బార్ అండ్ రెస్టారెంట్ లలో అయితే ఫుల్ బాటిల్ ధరకు క్వార్టర్ కూడా రావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య బాబుగా పిలుచుకునే బ్రాండ్ ధర క్వార్టర్ ఇప్పుడు 350 రూపాయలు అయ్యింది. పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణాలలో ఈ బ్రాండ్ క్వార్టర్ ధర ఏపీ ధరలో సగం కూడా ఉండదు. బ్రాందీ, విస్కీలలో పాపులర్ బ్రాండ్ల ధరలు ఏవైనా ఇంతే.. కానీ ఇక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇవి దొరకవు. క్వార్టర్ లు అమ్మే బార్లల్లో ఇంకో 100రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. పెగ్గుల లెక్క అయితే మరింత చిల్లు తప్పదు. గతంలో క్వార్టర్ ధర 110, ఫుల్ బాటిల్ 430 ఉండేది. నగరాల్లో ఉండే మాల్స్ లో విక్రయించే లీటర్ బాటిల్ 570రూపాయలకు దొరికేది. గత ఎన్నికలకు కొద్దినెలల ముందు 2018లో మద్యం ధరలు పెంచారు. క్వార్టర్ మీద 20రూపాయల చొప్పున ధర పెంచారు.ఎన్నికల తర్వాత దశల వారీగా మద్య నిషేధం అని ప్రకటించిన ప్రభుత్వం మద్యం ధరలు అమాంతం పెంచింది. చీప్ లిక్కర్ నుంచి, ఐఎంఎప్ ఎల్, బీర్లు అన్ని రకాల మీద ధర పెంచింది. దీంతో మద్యం వినియోగం మీద ఆసక్తి తగ్గుతుంది అని ప్రభుత్వ ఆలోచన. అధికారులు కూడా ప్రభుత్వ బాధ్యులకు ఇలాగే చెబుతుండొచ్చు. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సరిహద్దులు ఉన్న జిల్లాల్లో పొరుగు రాష్ట్రాలకు వెళ్లి కొనడం చేస్తున్నారు. కరోనా పుణ్యాన చాలామంది మద్యం రవాణా ఉపాధిగా మార్చుకుంటున్నారు.అక్రమ రవాణాలో పట్టుబడే మద్యానికి కొన్ని రెట్లు ఎక్కువగా ఏపీ లోకి ప్రవహిస్తోంది. వాస్తవానికి సరిహద్దు జిల్లాల్లో పని చేసే వారికి కాసులు మాత్రమే పండిస్తోంది. అన్ని చోట్ల నాటు సారా ఏరులై పారుతోంది. ఎస్ఈబీ బృందాలు సోషల్ మీడియాలో బట్టీలు ధ్వంసం చేశామని చెప్పుకుంటున్నా., వాటి వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో మాత్రం గుర్తించలేకపోతున్నారు. పోలీస్ పేజీల్లో రోజు మద్యం బట్టీల ధ్వంసం తప్ప మరొకటి కనిపించడం లేదు. ఖజానాకు రావాల్సిన డబ్బుకు ఇలా చిల్లులు పడుతున్నా మద్య నియంత్రణ బాగా అమలవుతోందని సరిపెట్టుకుంటున్నారు. ఏది ఏమైనా జై బాలయ్య అనుకోవడమే చేయగలిగింది.

Related Posts