YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

చిన్న‌మ్మకు ముందే చెక్

చిన్న‌మ్మకు ముందే చెక్

చెన్నై, అక్టోబ‌రు 9, 
తమిళనాడులో శశికళ హాట్ టాపిక్ గా మారారు. శశికళ రాకకోసం అన్నాడీఎంకేలోని అనేక మంది నేతలు ఎదురు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం పట్ల విసిగిపోయిన ఎమ్మెల్యేలు శశికళ వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు కొందరు మంత్రులు కూడా శశికళ కు మద్దతుదారులుగా ఉన్నారు. శశికళ విడుదలయ్యే సమయం దగ్గరపడే కొద్దీ వీరి వాయిస్ లో మార్పు వస్తుంది. శశికళ వచ్చి అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకుంటే పార్టీకి పూర్వ వైభవం వస్తుందంటున్నారు.శశికళ వచ్చే ఏడాది జనవరిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. అంటే ఎన్నికలకకు ముందుగానే చిన్నమ్మ తమిళనాడులో ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో కొందరు అన్నాడీఎంకే నేతలు ఆమెతో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మూడున్నరేళ్ల కాలంలో ఏ పదవులు దక్కని, ప్రాధాన్యత లభించని ఎమ్మెల్యేలు శశికళ రాక కోసం చూస్తున్నారని తెలిసింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య విభేధాలతో పార్టీ మరోసారి విజయం సాధించడం కష్టమని భావిస్తున్నారు.అందుకోసమే శశికళ మేనల్లుడు దినకరన్ తో కొందరు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. తొలి నుంచి దినకరన్ తనతో ఎమ్మెల్యేలు టచ్ లోఉన్నారని చెబుతూ వస్తున్నారు. కానీ అప్పట్లో కేంద్రంలో బీజేపీ ఉండటం, ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదని భావించడంతో ఎమ్మెల్యేలు కిక్కురుమనకుండా ఉన్నారు. ఆర్కే ఉప ఎన్నికలలో దినకకరన్ గెలవడంతో దాదాపు 14 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట వెళ్లారు. వారిపై అనర్హత వేటు పడటంతో మిగిలిన వారు సైలెంట్ అయిపోయారు.ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఎమ్మెల్యేలు తెగించినట్లే కనపడుతున్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను నమ్ముకుని ఉపయోగం లేదని భావించిన ఎమ్మెల్యేలు కొందరు శశికళ వస్తే ఆమె వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇంటలిజెన్స్ నివేదికల ప్రకారం విషయం తెలిసిన పళనిస్వామి శశికళ బయటకు వచ్చినా తమ జోలికి రాకుండా ఉండేందుకు ప్లాన్ వేశారంటున్నారు. అందులో భాగంగానే జస్టిస్ అరుముగస్వామి కమిటీని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జయలలిత మరణంపై ఈ కమిటీని పళనిస్వామి ప్రభుత్వం నియమించింది. అయితే కొన్నేళ్లుగా విచారణ స్తబ్దుగా సాగుతోంది. శశికళ వస్తుండటంతో తిరిగి ఈ కమిటీ విచారణను యాక్టివ్ చేసి శశికళను కట్టడి చేయాలన్నది పళనిస్వామి ప్లాన్ గా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts