అర్ధరాత్రి అదృశ్యమైన యువతి
హైదరాబాద్
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ తట్టి అన్నారంలో నివాసముండే ఇంటర్ విద్యార్థిని లారా ఆర్ధరాత్రినుంచి కలిపించడంలేదు. అర్థరాత్రి 12:45 నిమిషాలకు ఇంట్లో గొడవ పడి యువతి బయటికి వెళ్ళినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికిన కుటుంబ సభ్యులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అర్ధరాత్రి సోషల్ మీడియా లో చాటింగ్ చేస్తుండటం తో మందలించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. లారా ప్రస్తుతం మౌంట్ లీటర జీ స్కూల్ లో 12 వ తరగతి చదువుతోంది. మిస్సింగ్ కేసు నమోదు చేసి లారా ఆచూకీ కోసం హయత్ నగర్ పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఇంటి చుట్టుపక్కల వున్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు.