YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

యూఎస్ ఎన్నిక‌ల్లో నేకేడ్ బ్యాలెట్

యూఎస్ ఎన్నిక‌ల్లో  నేకేడ్ బ్యాలెట్

వాషింగ్ట‌న్ అక్టోబ‌రు 9, 
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఊపందుకున్నాయి. ప్రెసిడెంట్, వైస్ ఫ్రెసిడెంట్ అభ్యర్థులను ఎన్నుకొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్‌లో రాజకీయ వేడి రాజుకుంది. మరి, ఆ వేడిని తట్టుకోలేక అక్కడి హాలీవుడ్ సెలబ్రిటీలు దుస్తులు విప్పేస్తున్నారు. ఓ వీడియోతో ఓటర్లకు తమ ‘నగ్న సందేశం’ వినిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాళ్లు అలా నగ్నావతారం ఎత్తడం వెనుక అసలు కారణం నేకేడ్ బ్యాలెట్ యూఎస్ 25 శాతం ప్రజలు మెయిల్ ద్వారానే ఓటు వేస్తారు. అంటే పోలింగ్ స్టేషన్లకు వెళ్లకుండా కవర్లలో తమ ఓటును మెయిల్ చేస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సారి 80 శాతం మంది మెయిల్ ద్వారా పోలింగ్‌లో పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో పెన్సెల్వానియా సుప్రీం కోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.మెయిల్ ద్వారా ఓటు చేసేవారు.. రెండు ఎన్వెలప్ కవర్లలో తమ ఓటును భద్రపరచాలి. అంటే.. బ్యాలట్ పేపర్‌ను ముందుగా ఒక సీక్రసీ కవర్లో పెట్టాలి. అందులో ఓటర్ వివరాలు, తాము ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరు మాత్రమే ఉంటుంది. దాన్ని పూర్తిగా సీల్ చేసి మరో ఎన్వలప్‌లో పెట్టాలి. ఆ వెంటనే దాన్ని పోస్ట్ చేయాలి. ఒక వేళ ఓటరు తమ బ్యాలెట్‌ను సీక్రసీ కవర్లో పెట్టకుండా కేవలం ఎన్వెలప్‌లో మాత్రమే పెట్టి పోస్ట్ చేస్తే దాన్ని.. ‘నేకేడ్ బ్యాలెట్’గా పరిగణిస్తారు. దీంతో ఆ ఓటు చెల్లదు.దీనిపై ప్రజలకు అవగాహన కలిగించే నిమిత్తం.. హాలీవుడ్ సెలబ్రిటీలు దిగంబర వీడియోను వదిలారు. దుస్తులేవీ ధరించకుండా ‘నేకేడ్ బ్యాలెట్’ అంటే ఏమిటో వివరించారు. హాలీవుడ్ దిగ్గజాలు మార్క్ రుఫలో, క్రిస్ రాక్, జోష్ గాడ్, సూపర్ మోడల్ నవోమి కాంప్‌బెల్, హాస్య నటుడు అమీ షుమెర్, స్టాండ్ అప్ కమెడియన్ సారా సిల్వర్‌మాన్, టాక్ షో హోస్ట్ చెల్సియా హ్యాండ్లర్‌లు టాప్‌లెస్‌‌గా కనిపించారు.మీ ఓటు వేస్ట్ కాకుండా ఉండాలంటే.. రెండు కవర్లలో బ్యాలెట్ ఉండేలా జాగ్రత్త పడాలని ఈ వీడియోలో సూచించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న విధాలుగా స్పందిస్తున్నారు. వారి ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. కొందరు మాత్రం.. దీని నగ్నంగా మారాల్సిన అవసరం లేదని గాలి తీసేస్తున్నారు. ఈ వీడియో చూసి వీరి ప్రయత్నం మంచిదో కాదో మీరే చెప్పండి మరి.

Related Posts