YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎన్నికల రిజర్వేషన్స్‌ మళ్లీ యథాతథం..

ఎన్నికల రిజర్వేషన్స్‌ మళ్లీ యథాతథం..

ఎన్నికల రిజర్వేషన్స్‌ మళ్లీ యథాతథం..
హైద్రాబాద్,  
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో పాత డివిజన్స్‌ నే యథావిధిగా కొనసాగించ నున్నారు. ప్రస్తుతం జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో డివిజన్స్‌, సంఖ్య పెరగనుందని విస్తతంగా ప్రచారం జరిగింది. డివిజన్ల సంఖ్య పెరిగితే తాము ఎన్నికల బరిలోకి దిగాలని ఆయా పార్టీలకు చెందిన నేతలు, ఆశావాహులు భావించారు. కానీ వారి ఆశాలు అవిరైపోనాయి. పాత డివిజన్స్‌ నే యథావిధిగా ప్రస్తుత జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో పలువురు ఆశావాహులు తీవ్ర నిరాశకు గుర య్యారు. గత ఎన్నికల్లో కొనసాగించిన రిజర్వేషన్స్‌నే ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో యథావిధిగా కొనసాగించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. మరోవైపు డివిజన్స్‌ భౌగోళిక స్వరూపం లో సహితం ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని సికింద్రాబాద్‌ సర్కిల్‌ కమిషన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు.కొత్త రిజర్వేషన్ల అమలుకు నెల రోజుల వరకు సమయం పడుతుంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్త య్యాకే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి జీహెచ్‌ఎంసీ ఎన్ని కల్లో అమలు చేసిన రిజర్వేషన్స్‌యే ప్రస్తుత ఎన్నిక ల్లోనూ అమలు చేయాలని నిర్ణయంకు వచ్చారు. రిజర్వేషన్ల నిర్ణయంతో ఆయా రాజకీయ పార్టీల నుంచి పోటీ చేయాలని భావిస్తున్న సిట్టింగ్‌ కార్పొరేటర్స్‌తో పాటుగా ఔత్సాహికుల్లో ఆశలను నింపాయి. మరికొందరు, పోటీదారులకు రిజర్వేషన్లు తీవ్రమైన నిరాశను కల్గిస్తున్నాయి. పాత రిజర్వేషన్లనే కొనసాగటంతో అభ్యర్థులలో ఉత్కంఠ వీడింది. మరోవైపు గత కొంతకాలంగా నుండి ఎన్నికల్లో డివిజన్స్‌ పునర్విభజన జరిగి డివిజన్స్‌ సంఖ్య పెరుగుతాయి, రిజర్వేషన్స్‌ మరుతాయి, అని ఆశించి కొంత మేరకు ఖర్చులు పెట్టిన ఆశావహులు నోటి నుండి మాట రావడం లేదు.వారు తీవ్రమైన నిరాశ నిస్ప్రుహ మధ్య కొట్టి మిట్టాడుతున్నారు. ఎప్పటి నుంచో కార్పొరేటర్‌ కావాలని,భావించిన, ఆశించిన నేతలకు ఈ ఎన్నికలు, ఈ రిజర్వేషన్స్‌ వారికి మింగుడు పడటం లేదు.నగరం ఎక్కడ లేని విదంగా సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఐదు డివిజన్స్‌ కూడా మహిళ రిజర్వేషన్స్‌ అయిన విషయం తెల్సిందే. మళ్ళీ కూడా ఐదుకు ఐదు డివిజన్స్‌ మహిళలకే ఖరారు కావడంతో కొందరు వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైన కొందరు పురుషులకు రిజర్వేషన్స్‌ ద్వారా అవకాశాలు వస్తాయి అని భావించిన వారు భంగంపడుతున్నారు.ఈ మారు ఇక్కడ ఐదు డివిజన్స్‌ ఒక్కరి లేక ఇద్దరికే సిటు దక్కే అవకాశలు అతి కొద్దిగా ఉండగా, నాగులు చోట్లా మాత్రం కొత్త వారికే అవకాశాలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తు న్నాయి. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే టి.పద్మారావు తనయుడు టి.రామేశ్వర్‌ గౌడ్‌ మాత్రం, సీతాఫల్‌మండి నుండి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండగా మరి రిజర్వేషన్‌ ఆయనకు కొంత నిరాశే మిగిలింది. ఇక ఒక కార్పొరేటర్‌ పై తారాస్థాయికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిపై యువ నేత కేటీఆర్‌ కు పలుమార్లు పిర్యాదు అందినట్లు తెలిసింది.ఈ సారి మాత్రం కొత్త ముఖ లకే అవకాశాలు ఉన్నాయి అని తెలిసింది. అధికార టిఆర్‌ఎస్‌ నుండి పోటీ చేసేందుకు తీవ్రస్థాయి ఆశావహుల సంఖ్య రెట్టింపు లో ఉండగా, కాంగ్రెస్‌, బీజేపీ పోటీలో ఉండేందుకు కొంత వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం. పలు సర్వేలు టీఆర్‌ఎస్‌కు అనుకూలం ఉండటంతో పాటుగా, అండ బలం, అధికార బలాలకుతోడు ఆర్థికంగా పార్టీ కూడా తోడ్పాటు ఇస్తుందన్న భావంతో ఆ పార్టీ ఆశావహుల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.

Related Posts