కేంద్ర కార్మిక శాఖమంత్రి సంతోష్ గాంగ్వార్ తో తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి భేటీ అయ్యారు. కార్మికులకు సంబంధించిన పలు అంశాలపై నాయిని కేంద్ర కార్మిక శాఖ మంత్రితో చర్చించారు. . డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్, ఈఎస్ ఐ డిస్పెన్సరీ రామగుండం,జీడిమెట్ల కు 30 పడకలు ఆసుపత్రి గా అప్ గ్రేడ్ చేయడం వంటి అంశాల పై చర్చ కొనసాగింది. తరువాత నాయిని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు బడ్జెట్ ని సరి అయిన సమయానికి కేటాయించాలని కోరామని అన్నారు. నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ పథకంలో నికి తీసుకుని రావడానికి సహకారం కింద ఒక్కొక్కరికి వంద రూపాయల ఈఎస్ఐ కార్పొరేషన్ వారు చెల్లించాలి. ఈపిఎఫ్ రీజనల్ కమిటీ ప్రతిపాదనలు కేంద్రం ఆమోదించాలని కోరామని అన్నారు. బండారు దత్తాత్రేయ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు 14 ప్రతిపాదనలు ఇచ్చాం. పెండింగ్ లో ఉన్న అంశాలు అన్నిటిని మంత్రి గంగ్వార్ ని అడిగామని అన్నారు. తమ చర్చలకు కేంద్ర మంత్రి గంగ్వార్ సానుకూలంగా స్పందించారని నాయిని అన్నారు.