YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సంప్రదాయాలకు అనుగుణంగా కానుకలు

సంప్రదాయాలకు అనుగుణంగా కానుకలు

సంప్రదాయాలకు అనుగుణంగా కానుకలు
హైదరాబాద్
కూకట్ పల్లి నియోజకవర్గం లోని బాలాజీ నగర్ డివిజన్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్  ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.  అలాగే తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ప్రతి పండుగకి వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా వారికి కానుకలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే బతుకమ్మ పండుగకు ప్రతి సంవత్సరం ఆడపడుచులకు చీరల పంపిణీ చేస్తున్నామని,  ఈ చీరలు కూడా కులమతాలకు అతీతంగా అందరికీ అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్  కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే మాధవరం తెలిపారు...

Related Posts