గ్రూప్ హౌసింగ్ లో గందరగోళం
విశాఖపట్నం
విశాఖజిల్లా నర్సీపట్నంలో గ్రూప్ హౌసింగ్ డిడిలు కట్టినవారి పరిస్థితి గందరగోళం గా వుందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల ప్రచార సభలో గ్రూప్ హౌసింగీపై జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అర్హులను అనర్హులుగా సచివాలయ సిబ్బంది చూపుతున్నారంటూ టీడీపీ నేతల ఆరోపణ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ మౌర్యకు కు వినతిపత్రం అందచేశారు. నర్సీప ట్నంలో ఎన్టీఆర్ గ్రూప్ హౌసింగ్, ఇళ్లపట్టాల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై వెంటనే దర్యాప్తు చెయ్యాలంటూ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నర్సీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకట రమణ మాట్లాడుతూ ఇళ్ల స్థలలు 3000మంది అర్హులు ఉండగా ఇప్పుడు వారిలో 40 శాతం మందిని అర్హులు కాదంటూ తొలగించారన్నారు.అర్హులను అనర్హులుగా, అనర్హులను అర్హులుగా జాబితాలో అధికార పార్టీ ఒత్తిళ్ళతో సచివాలయ సిబ్బంది తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై ప్రతి గ్రామ,వార్డు సచివలయాలలో గ్రామ సభలు నిర్వహించి అందులో అర్హులైన వారి, అనర్హులైన వారి జాబితాలను డిస్ ప్లే చెయ్యాలంటూ డిమాండ్ చేశారు.