YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా సంక్షోభంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆపలేదు

కరోనా సంక్షోభంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆపలేదు

చొప్పదండి అక్టోబ‌రు 9, 

కరోనా సంక్షోభంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆపలేదు  తెలంగాణ ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరెలు  చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కరీంనగర్ జిల్లా చొప్ప దండి నియోజక వర్గం బోయినపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శుక్రవారం బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  మాట్లాడుతూ కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్ల వద్దే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాలు చీరలను పంపిణీ చేస్తాయని తెలిపారు.
ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు, వెండి జరీ అంచులతో చీరలను తయారు చేశారని రూ. 317.81 కోట్ల వ్యయంతో కోటికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలియ చేసారు. నేతన్నల కష్టాలేంటో ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా తెలుసన్నారు. ఉద్యమ సమయంలోనే నేతన్నల కష్టాలను స్వయంగా చూశారని అన్నారు. ఒక్క నెలలో ఏడుగురు నేతన్నలు ఆత్మహత్య చేసుకోవడం చూసి ఆయన చలించిపోయారని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారాల కోసం కృషి చేస్తున్నారని తెలియ చేసారు. నేతన్నలకు పని కల్పించి వారికి ఆదాయం పెంచాలని సీఎం భావించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 1200 కోట్ల రూపాయాల బడ్జెట్ను చేనేత జౌళి శాఖకు కేటాయించారని అన్నారు. పవర్ లూమ్స్కు చేతి నిండా పని కల్పిస్తున్నామన్నాని అన్నారు. ప్రతి ఏడాది కోటి చీరలు తయారు చేయాలని సీఎం ఆదేశించారని తెలియ చేసారు. వేలాది నేతన్నల కుటుంబాలకు ఉపాధి కల్పించాం. ఒక్క బతుకమ్మ చీరలకే రూ. 1033 కోట్లు ఖర్చు పెట్టిందని ఈ నాలుగేళ్లలోనే నాలుగు కోట్ల చీరలను పంపిణీ చేసిందని తెలియచేసారు. ప్రభుత్వ స్కూల్ యూనిఫాం కూడా పవర్ లూమ్స్ ద్వారానే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీలు, ఇతర ఐసీడీఎస్ సిబ్బందికి చెందిన చీరలు, కేసీఆర్ కిట్లో ఇచ్చే చీరలను కూడా పవర్ లూమ్స్ ద్వారానే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు.
దీంతో నేతన్నల ఆత్మహత్యలు లేవు. రైతు, నేతన్న ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని పేర్కొన్నారు. నేతన్న భవిష్యత్ భద్రంగా ఉంటుందన్నారు. బతుకమ్మ పండుగకే కాదు, రంజాన్, క్రిస్మస్ పండుగలకు కూడా చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్రీటిసి కత్తెరపాక ఉమా కొండయ్య, ఎంపిపి పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ గుంటి లతాశ్రీ శంకర్ పలువురు ప్రజా ప్రతి నిధులు, అధికారులు, టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts