YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు

రాంచి అక్టోబర్ 9 
ఆర్జేడీ అధినేత‌, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, మాజీ కేంద్ర‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభ‌కోణానికి సంబంధించిన ఓ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఈ మేర‌కు ఆదేశాలు జారీచేసింది. అయితే, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఇప్ప‌టికే దాణా కుంభ‌కోణం కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభ‌విస్తున్నారు. మ‌రోవైపు దుమ్కా ఖ‌జానా కేసు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేప‌థ్యంలో లాలూకు ప్ర‌స్తుతం బెయిల్ మంజూరైనా జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం మాత్రం లేదు.  
 

Related Posts