YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌లేదు: ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్

వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌లేదు: ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్

హైద‌రాబాద్‌ అక్టోబర్ 9  
ఆర్బీఐ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌లేదు.  వ‌డ్డీ రేట‌ను య‌ధావిధిగా 4 శాతం వ‌ద్దే ఉంచింది.  ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మీక్ష వివ‌రాల‌ను ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఇవాళ వెల్ల‌డించారు.  వ‌డ్డీ రేట్లను య‌ధాత‌థంగా ఉంచిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  ప్ర‌స్తుతం ఉన్న రెపో, రివ‌ర్స్ రెపోలో ఎలాంటి మార్పు చేయ‌లేద‌న్నారు.  మూడో త్రైమాసికంలో ప్ర‌పంచ ఆర్థిక కార్య‌క‌లాపాలు పుంజుకున్న‌ట్లు క‌నిపిస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. 2021 సంవ‌త్స‌రానికి జీడీపీ 9.5 శాతం త‌గ్గ‌నున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ అంచ‌నా వేశారు.   సెప్టెంబ‌ర్‌లో కూడా ద్ర‌వ్యోల్బ‌ణం అధికంగా ఉంటుంద‌ని, ఆ త‌ర్వాత క్ర‌మంగా మూడ‌వ‌, నాల్గ‌వ త్రైమాసికంలో త‌గ్గుతుంద‌ని అంచనా వేశామ‌ని అన్నారు. మార్కెట్ ఒడిదిడుకులు ఎదుర్కొనేందుకు ఆర్బీఐ సంసిద్ధంగా ఉంద‌ని కూడా ఆయ‌న తెలిపారు. స్వ‌దేశీ లావాదేవీల‌ను వేగంగా నిర్వ‌హించేందుకు  ఈ ఏడాది డిసెంబ‌ర్ నుంచి రోజంతా ఆర్టీజీఎస్ సేవ‌ల‌ను అందించ‌నున్న‌ట్లు శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.   

Related Posts