రాజమండ్రి అక్టోబర్ 9
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై 60 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారయత్నం, అనపర్తి గ్రామాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. రోజురోజుకు మంటగలిసి పోతున్న మానవ సంబంధాలకు అద్దం పట్టేలా లేస్ ప్యాకెట్ కొనుక్కోవడానికి కిరాణా షాపు కు వెళ్లిన తొమ్మిది సంవత్సరాల బాలిక ను కిరాణా షాప్ యాజమాని ఇంటిలోనికి లాక్కుని వెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దాంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వాళ్లు హుటాహుటిన బాలికను స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానితుడను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బాలిక పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. బాలికను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివరాలను అడిగి తెలుసుకున్నారు.