విజయవాడ అక్టోబర్ 9
మంత్రులు, వైసిపి నేతలు వాడుతున్న భాష పై అమరావతి జేఎసి నేతలు మండిపడ్డారు. జాక్ నేత శివారెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉంచాలని పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదు. 300రోజులకు ఉద్యమం చేరుతున్నా ప్రభుత్వం లో చలనం లేదు. ఆది, సోమవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమరావతి కి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కొంతమంది కుసంస్కారంతో మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు అని కూడా చూడకుండా దూషిస్తున్నారు. మీకు చేతనైతే.. జగన్ దగ్గరకు వెళ్లి మూడు రాజధానులు సరి కాదని చెప్పాలని అన్నారు. వాళ్లు కూడా ఒక మహిళకే పుట్టారనే ఇంగితం మరచి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు. మరో నేత పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ అమరావతి మహోద్యమం _జరుగుతున్నా కళ్లు ఉండి చూడలేని గుడ్డి ప్రభుత్వం ఇది. ప్రజలు ఆకాంక్షల మేరకు పాలన చేస్తారని ఓట్లు వేసి గెలిపించారు. న్యాయం కోసం పోరాడుతున్న అమరావతి అతివలను సిగ్గు లేకుండా దూషిస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య ప్రభుత్వమే విద్వేషాలను రెచ్చ గొట్టింది. ప్రజలకు ప్రభుత్వం కుట్ర ఇప్పుడు అర్ధం అయ్యింది. కోవిడ్ నిబంధనలు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున లేచేది. 300వ రోజుకు చేరుకున్న ఉద్యమం లో అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ నెల 11న రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల ప్రధాన కూడళ్లలో ర్యాలీలు చేయాలని అన్నారు. 12వ తేదీ సోమవారం అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అన్ని జిల్లాల్లో ప్రజలు ఈ ఆందోళనల్లో పాల్గొని ప్రభుత్వం లో చలనం తేవాలి. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే.. పోరాటం మరింత ఉధృతం చేస్తాం. మహిళల పై నోరు పారేసుకుంటున్న నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు.