న్యూ ఢిల్లీ అక్టోబర్ 9
కరోనా వైరస్ నుంచి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ త్వరలోనే మళ్లీ ప్రజాజీవితంలోకి రానున్న ఆయన వైట్‌హౌజ్ నుంచి ఫాక్స్ న్యూస్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ బైడెన్ గెలిస్తే, అప్పుడు కమ్యూనిస్టు కమలా హారిస్ నెలలోపే పగ్గాలను తన చేతుల్లోకి తీసుకుంటుందని ట్రంప్ ఆరోపించారు. కమలా కమ్యూనిస్టు అని, ఆమె సోషలిస్టు కాదు అని, ఆమె అభిప్రాయాలను ఓసారి పరిశీలించండి, సరిహద్దుల్ని ఓపెన్ చేసి.. హంతకులను, రేపిస్టులను దేశంలోకి ఆహ్వానించాలనుకున్నదని ట్రంప్ ఆరోపించారు. కమలా హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థుల చర్చలో పాల్గొన్న తర్వాత ట్రంప్ ఈ కామెంట్ చేశారు. మనకు ఓ కమ్యూనిస్టు నేతగా రాబోతున్నారని, నేను జోసెఫ్ బైడెన్‌తో చర్చలో పాల్గొన్నానని, ఆయన రెండు నెలల కన్నా ఎక్కువ కాలం అధ్యక్షుడిగా చేయలేరని, అది నా అభిప్రాయం అని ట్రంప్ అన్నారు. ఈ శనివారం ఆయన ఫ్లోరిడాలో ర్యాలీ నిర్వహిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.