YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పీయూష్ గోయ‌ల్‌ కు రామ్‌విలాస్‌ పాశ్వాన్ శాఖ‌లు

పీయూష్ గోయ‌ల్‌ కు రామ్‌విలాస్‌ పాశ్వాన్ శాఖ‌లు

న్యూఢిల్లీ అక్టోబర్ 9 
కేంద్ర రైల్వే, ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు కేంద్ర ప్ర‌భుత్వం అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మృతితో ఆయ‌న శాఖ‌ల‌ను పీయూష్ గోయ‌ల్‌కు కేటాయించారు. పాశ్వాన్ నేతృత్వం వ‌హించిన‌ ఆహార‌, ప్ర‌జా పంపిణీ శాఖల‌ను ఇక నుంచి పీయూష్ గోయ‌ల్ ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌నున్నారు.లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీని స్థాపించిన రామ్‌విలాస్ పాశ్వాన్‌.. ఎనిమిది సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. గ‌త కొన్ని వారాల నుంచి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న పాశ్వాన్ ఇటీవ‌ల గుండె ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. 1990 ద‌శ‌కంలో దేశ‌వ్యాప్తంగా మండ‌ల్ క‌మిష‌న్ అమ‌లు చేయ‌డంలో రామ్‌విలాస్ పాశ్వాన్ కీల‌క పాత్ర పోషించారు. 1969లో తొలిసారి ఆయ‌న సంయుక్త సోష‌లిస్టు పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యే అయ్యారు. హ‌జీపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న రికార్డు స్థాయిలో గెలుపొందారు.  అత్య‌ధిక తేడా ఓట్ల‌తోనూ పాశ్వాన్ రికార్డు క్రియేట్ చేశారు. వివిధ పార్టీ నేత‌ల‌తో ఆయ‌న మంచి సంబంధాల‌ను పెంచుకున్నారు. జ‌న‌తాద‌ళ్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌భుత్వాల్లో ఆయ‌న కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  

Related Posts