లక్నో అక్టోబర్ 9
ఒక భర్త క్రూర మృగంలా ప్రవర్తించాడు. తన భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె తలను నరికేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలోని నీతానగర్‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. చిన్నార్ యాదవ్, విమల(35) దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే విమల మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు యాదవ్ అనుమానించాడు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో ఊగిపోయిన యాదవ్.. పదునైన ఆయుధంతో విమల తలను నరికేశాడు. ఆ తర్వాత భార్య తలను తీసుకుని నేరుగా బాబేరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. భార్య తలను చూసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.