YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా చూడండి : కేటీఆర్

బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా చూడండి : కేటీఆర్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం చేసిన ట్వీట్‌ ఫై మంత్రి కేటీఆర్ స్పందించారు.బ్యాంకుల్లోనూ, ఏటీఎంల్లోనూ ఏర్పడ్డ నగదు కొరత అకస్మాత్తుగా జరగలేదని, అది పాక్షికమైన అంశం కూడా కాదని కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. నగదు కొరతపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ చేసిన ట్వీట్‌ను సూచిస్తూ కేటీఆర్ తన ట్విట్టర్‌లో ఈ అంశాన్ని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గత మూడు నెలలుగా నగదు కొరత గురించి ఫిర్యాదులు వింటున్నానని కేటీఆర్ తెలిపారు. ఆర్బీఐతో కలిసి ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థికశాఖను కోరారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Related Posts