YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఢిల్లీలో టిఆర్ ఎస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపు

ఢిల్లీలో టిఆర్ ఎస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపు

న్యూ ఢిల్లీ అక్టోబర్ 10 
ఢిల్లీలో టిఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం స్థలం కేటాయించింది.గత కొద్ది నెలలుగా టిఆర్ ఎస్ పార్లమెంట్ నాయకులు పార్టీకార్యాలయం నిర్మాణం కోసం ఢిల్లీలో స్థలాలను అన్వేషించారు. పార్టీ ఆఫీస్ కోసం న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయిస్తూ మోదీ సర్కార్ శుక్రవారం సీఎం కేసీఆర్ కు గుడ్ న్యూస్ చెప్పింది.టిఆర్ ఎస్ రాజ్యసభ పక్షనాయకుడు కెకె పార్లమెంట్ నాయకుడు నామా ఢిలీల్లో స్థలాలను పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు. కొన్ని స్థలాలను ఢిల్లీలోని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో  ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ ల్యాండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దీన్ దయాల్.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. 2018లో ప్రారంభించిన ప్రయత్నాలు ఎట్టకేలకు విజయం సాధించడంతో కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలో స్థలం కేటాయింపు సమస్యపరిష్కారం అవడంతో త్వరలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు.దేశానికి స్వాతంత్య్రం  వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ప్రాంతీయ పార్టీల హవా మొదలై నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకీ కేరాఫ్ ఆఫీసు లేకపోవడం గమనార్హం. ఆయా పార్టీల ఎంపీలకు కేటాయించే ఇళ్లలోనే ఇన్నాళ్లూ రీజనల్ పార్టీల ఆఫీసులు కొనసాగాయి. కాంగ్రెస్ బీజేపీ సీపీఎం సీపీఐ పార్టీలకు మాత్రమే ఢిల్లీలో ఆఫీసులు ఉండగా జాతీయ పార్టీ టీడీపీకిగానీ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకిగానీ సొంత కార్యాలయం లేదు. ఈ క్రమంలో ఢిల్లీలో సొంతగా పార్టీ ఆఫీసు కట్టుకోనున్న తొలి పార్టీగా టీఆర్ఎస్ అవతరించనుంది.

Related Posts