మానవ సంబంధాలే ముఖ్య ఆయుధాలుగా తెరకెక్కిన చిత్రం ‘కేస్ 99’. ప్రియదర్శిని రామ్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. శనివారం ‘కేస్ 99’ ఫిల్మ్ ఫస్ట్‌లుక్‌ను మాస్ కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ, ‘‘ ప్రియదర్శిని రామ్ అనగానే నాకు గుర్తొచ్చేది, తాను ఏ పనిచేసినా ప్రాణం పెట్టి చేస్తాడు. ఈ సినిమాలో పాలుని, నీటిని వేరుచేసే హంస లాంటి పాత్రతో సమాజంలో జరిగే చెడును బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవసంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న సమయంలో వస్తున్న చిత్రమిది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.
దర్శకుడు రామ్ మాట్లాడుతూ, ‘‘గ్రేట్ టెక్నీషియన్, అంతకంటే మంచి మనసున్న వ్యక్తి బోయపాటి శ్రీను. మట్టిని నమ్ముకుని సాధారణ జీవితం నుండి పైకొచ్చిన వ్యక్తి బోయపాటి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లాంటి ఓటీటీలో ఎక్కడ చూసినా పదికి ఏడు సినిమాలు క్రైమ్ థ్రిల్లర్‌లే ఉంటున్నాయి. క్రైమ్ సినిమాలే ఎందుకుంటున్నాయంటే సమాజంలో జరుగుతున్నాయి కాబట్టే ఉంటున్నాయి. వాటన్నింటిని నేను పరిష్కరించలేనుగాని నా వంతుగా చక్కని సినిమా తీయాలి అనిపించింది. వారం పదిరోజుల్లో సినిమాకి సంబంధించిన ఫస్ట్‌కాపీ రెడీ అవుతుంది. సినిమా ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేశాం. దానికి కారణం కొత్త రక్తంతో వస్తున్న యువనిర్మాతలు గౌతమ్, కీర్తీ, వివేక్‌లు తమ మెలోడ్రామా అనే కంపెనీ ద్వారా నాకు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. వారందరికి మాట ఇస్తున్నాను. నేను చాలా మంచి సినిమా తీశానని’’ అన్నారు.
తారాగణం: ప్రియదర్శిని రామ్, తిరువీర్, అనువర్ణ, నిహాల్ కోదాటి, అజయ్ ఖతుర్వార్, అపరాజిత, ప్రణీత పట్నాయక్, క్రియేష్ రాజ్, అశోక్ రావు, విజయ్ గోపరాజు, మనోజ్ ముత్యం, నితిన్, ప్రసన్, రోషన్