YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

భారత్‌ లోనే ఎక్కువ ముస్లింలు సంతృప్తికర ఉన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారత్‌ లోనే ఎక్కువ ముస్లింలు సంతృప్తికర ఉన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

న్యూఢిల్లీ అక్టోబర్ 11
 ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో ఎక్కువ సంతృప్తికర ముస్లింలు ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయితే, స్వలాభం ప్రభావితమయ్యే వ్యక్తుల ద్వారా మూర్ఖత్వం, వేర్పాటువాదం వ్యాప్తి చెందుతున్నదని ఆయన నొక్కి చెప్పారు. భారతదేశం గురించి చెడు ఆలోచన వచ్చినప్పుడల్లా ప్రజలంతా కలిసి నిలబడ్డారని ఆయన గుర్తుచేశారు. మహారాష్ట్రకు చెందిన 'వివేక్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌ అనేక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. పాకిస్తాన్‌ ప్రత్యేక దేశంగా సృష్టించినందున ఇతర మతాలకు చెందిన వారికి హక్కులు లేవన్నారు. భారతదేశంలో అన్ని మతాల ప్రజలు ఉన్నారని, పాక్‌లో మాదిరి కాకుండా భారత్‌లో అన్నిమతాల వారికి తమతమ మతాల విశ్వాసాన్ని పాటించే స్వేచ్ఛ కలిగివున్నారని తెలిపారు. మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు వ్యతిరేకంగా పోరాడిన మేవార్ రాజు మహారాణా ప్రతాప్ సైన్యంలో చాలా మంది ముస్లింలు ఉండేవారని, భారతదేశ సంస్కృతిపై దాడి జరిగినప్పుడల్లా అన్ని మతాల ప్రజలు ఒకచోట చేరి ఐకమత్యం ప్రదర్శించారని చెప్పారు. భారత రాజ్యాంగం హిందువులు మాత్రమే ఇక్కడ ఉండాలని చెప్పలేదని, ముస్లింలు ఇక్కడ ఉండాలనుకుంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాలి అని కూడా రాజ్యాంగంలో పేర్కొనలేదని భగవత్ పేర్కొన్నారు. ''ముస్లింలు పాకిస్తాన్‌లో నివసించేలా హిందుస్తాన్ విభజించారని, అయితే ఆ సమయంలో ఉన్న పరిస్థితుల ప్రకారం భారత్‌లో హిందువులు పూర్తి ప్రభావాన్ని కలిగి ఉండాలని, కాని ఇతర మతాలను అనుసరించిన ప్రజలకు పాకిస్తాన్‌కు వెళ్లాలని భారత రాజ్యాంగం ఎప్పుడూ చెప్పలేదు'' అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. ఏ మతంలోనైనా ప్రతి ఒక్కరినీ ఒకే తాడుపైకి అనుసంధానించడం, ఉద్ధరించడం, ఏకం చేయడమే ప్రధాన పాత్రగా ఉంటుందని తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై భగవత్ మాట్లాడుతూ.. ఈ ఆలయం కర్మ ప్రయోజనాల కోసం కాదని, ఇది భారతదేశ జాతీయ విలువలు, స్వభావానికి చిహ్నంగా ఉంటుందని చెప్పారు.

Related Posts