జహీరాబాద్ అక్టోబర్ 11
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధి తాండూరు రోడ్డు వైపు పై వంతెన సమీపంలో అనుమతి లేని ఇసుకను రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ బాబు అదేశంతో స్వీజ్ చేశామని తహసిల్దార్ నాగేశ్వరరావు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని, జిల్లా స్థాయి అధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు శనివారం మధ్యాహ్నం అకస్మికంగా ఇసుక లారీలు నిలిపే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చిందని తహసిల్దార్ నాగేశ్వరరావు చెప్పారు. అనుమతులు లేని ప్రదేశంలో నిలిపిన లారీల ఇసుకకు సరైన దస్తావేజులు కలిగి ఉంటే వాటిని ఉచితంగా వదిలి వేస్తామని తహసిల్దార్ నాగేశ్వర్ రావు వివరించారు. కొందరు వ్యాపారులు నిల్వ చేసిన ఇసుక లారీలను స్వాధీనం చేసుకున్నామని తహసిల్దార్ పోతురాజు నాగేశ్వరరావు స్పష్టం చేశారు.