YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మహిళల భద్రతపై కేంద్రహోం మంత్రిత్వశాఖ తాజా ఆదేశం హాథ్రస్ ఘటన తర్వాత రాష్ట్రాలకు సలహా

మహిళల భద్రతపై కేంద్రహోం మంత్రిత్వశాఖ తాజా ఆదేశం హాథ్రస్ ఘటన తర్వాత రాష్ట్రాలకు సలహా

న్యూఢిల్లీ అక్టోబర్ 11
యూపీలోని హాథ్రస్ ఘటన తర్వాత మహిళల భద్రతపై రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ శనివారం తాజా ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై నేరాలకు సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రిత్వశాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చింది. మహిళలపై నేరాలు జరిగినపుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ) లోని సెక్షన్ 154 లోని సబ్ సెక్షన్ (1) కింద గుర్తించదగిన నేరం జరిగితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి అని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. మహిళలపై లైంగిక వేధింపుల కేసుల సమాచారం అందిన వెంటనే ఎఫ్ఐఆర్, పోలీసుస్టేషను పరిధికి వెలుపల జరిగితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. మహిళల నేరాలకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదులో విఫలమైతే అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్రహోంమంత్రిత్వశాఖ హెచ్చరించింది. మహిళల నేరాలపై ఇండియన్ పీనల్ కోడ్ 1860 (ఐపీసీ) లోని సెక్షన్ 166 ఎ (సి) సెక్షన్ 326 ఎ, సెక్షన్ 326 బి, సెక్షన్ 354, సెక్షన్ 354 బి, సెక్షన్ 370, సెక్షన్ 370 ఎ, సెక్షన్ 376, సెక్షన్ 376 ఎ, సెక్షన్ 376 బి, సెక్షన్ 376 బి, సెక్షన్ 376 సి, సెక్షన్ 376 డి, సెక్షన్ 376 డిఎ, సెక్షన్ 376 డిబి, సెక్షన్ 376 ఇ లేదా ఐపిసిలోని సెక్షన్ 509ల ప్రకారం కేసులు పెట్టాలని కేంద్రం సూచించింది. యూపీలోని హాథ్రస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు ఉన్నత కులస్థులు సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన ఘటనపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షపార్టీలు, మహిళా సంఘాల కార్యకర్తుల నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ మహిళల నేరాలపై సత్వరం చర్యలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రిత్వశాఖ తాజాగా సలహా ఇచ్చింది.

Related Posts