YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అసలు ధరణి సర్వే మతలబేంటి?: మర్రి శశిధర్‌రెడ్డి

అసలు ధరణి సర్వే మతలబేంటి?: మర్రి శశిధర్‌రెడ్డి

హైదరాబాద్‌ అక్టోబర్ 11
 గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యలో సమగ్రకుటుంబ సర్వే చేశారు, ఇప్పుడేమో ధరణి సర్వే అంటున్నారు. అసలు ఆ సర్వే మతలబేంటని కాంగ్రెస్‌ ఎన్నికల కో ఆర్డినేషన్‌ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి ప్రశ్నించారు. ధరణి సర్వేపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓటర్లు చాలా అసంతృప్తితో ఉన్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్‌ఎస్‌కు భారీ ఓటమి తప్పదని శశిధర్‌ అన్నారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల రిజర్వేషన్‌ ప్రభుత్వం సరిగా నిర్వహించడంలేదని ఆరోపించారు.బీజీ ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు జరగడం లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయంగా ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. వార్డు విభజనలో గతంలో జరిగిన విధానాన్ని అడిగితే ఇప్పటి వరకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తాము అడిగిన సమాచారం ఇవ్వాలని సవాల్‌ చేశారు. 2021 ఫిబ్రవరి వరకు జీహెచ్‌ఎంసీ కాలపరిమితి ఉన్నా.. ఆగమేఘాల మీద అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.

Related Posts