YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శ్రీవేంకటేశ్వరస్వామిని 'అర్చావతారం'

శ్రీవేంకటేశ్వరస్వామిని 'అర్చావతారం'

అవతారాలలో ఈ భేదం ఏమిటనేదానికి ఈవిధమైన వివరణ*
విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకారం నారాయణుడు ఐదు స్వరూపాలతో భాసిస్తున్నాడు.
1. పర, 2. వ్యూహ, 3. విభవ, 4. అంతర్యామి, 5. అర్చావతారం.
*1. పరస్వరూపం:* శుద్ధసత్వంతో, అద్భుత తేజస్సుతో వైకుంఠంలో నిత్యమూ భాసించే, భూదేవీ శ్రీ దేవీ సమేత మూర్తి. కేవలం నిత్యముక్తులకు ఇది దర్శనమిస్తుంది.
*2:వ్యూహస్వరూపం:* జగత్ సృష్టికి మూలకారణమైన స్వరూపం. నాలుగు వ్యూహాలతో ఉన్నది. అవి - వాసుదేవ, అనిరుద్ద, ప్రద్యుమ్న, సంకర్షణ. ఈ వ్యూహాలతో సృష్టి స్థితి లయలను నిర్వహించువాడు. వాసుదేవుడు క్షీరసాగర శయనుడైన మూలమూర్తి. అనిరుద్ధుడు సృష్టికారక చైతన్యం. ప్రద్యుమ్నుడు స్థితి శక్తి. సంకర్షణుడు లయ కారకుడు. అనిరుద్దాంశ బ్రహ్మ, సంకర్షణాంశం రుద్రుడు, ప్రద్యుమ్న తేజం విష్ణువు.
*3. విభవ స్వరూపం:* ధర్మరక్షణార్ధం లీలగా అవతరించే నారాయణుడు. అప్రాకృత దివ్య మంగళస్వరూపంతో, లీలా విభూతితో ఇలకు దిగిన శ్రీరామ, శ్రీకృషాదులు హరి యొక్క విభవస్వరూపులు.
*4. అంతర్యామి:* జీవుల హృదయాలలో భాసించే పరమాత్మ. అందరి ప్రవృత్తులకు కారకమై, సత్కర్మానుష్ఠానాలకు అనుమతించే స్వరూపమే అంతర్యామి.
*5. అర్చావతారం:* అర్చింపబడి అనుగ్రహించేందుకు వివిధ క్షేత్రాలలో వెలసిన భగవద్రూపం. తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడు శ్రీరంగంలో రంగనాథుడు మొదలైన వారు.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts