విజయనగరంలో కలకలంరేపిన దివ్యాంగురాలిపై అత్యాచారం కేసులో ట్విస్ట్ షాకింగ్‌కు గురి చేస్తోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిశాయి. ఈ ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగిందో జిల్లా ఎస్పీనే స్వయంగా చెప్పుకొచ్చారు. పూసపాటిరేగకు చెందిన యువతి... విజయనగరంలోని తన అక్క ఇంటికి వెళుతున్నానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లింది. అయితే ఆమె అక్కడికి వెళ్లకుండా విజయనగరంలో తిరిగి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళ్లింది. రాత్రి వరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లావని తల్లిదండ్రులు యువతిని నిలదీశారు. తల్లిదండ్రులు గట్టిగా అడిగేసరికి ఆమె భయపడి అత్యాచారం జరిగిందని చెప్పిందట. దీంతో వాళ్లు యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు... స్పాట్‌కు వెళ్లి పరిశీలించారు. చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించి... జనాలను కూడా ఆరా తీశారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలోని ఆధారాలు, మెడికల్ రిపోర్టులకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చింది. పోలీసులు ఆమెను గట్టిగా అడగడంతో అసలు విషయం చెప్పుకొచ్చింది. భయంతోనే తల్లిదండ్రులకు అబద్ధం చెప్పినట్లు ఒప్పుకుంది