YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బ‌లోపేతం దిశ‌గా అడుగులు

బ‌లోపేతం దిశ‌గా అడుగులు

తిరుప‌తి అక్టోబ‌రు 12, 
టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంట‌రీ జిల్లాల అధ్యక్షుల‌ను నియ‌మించారు. ఈ క్రమంలో అనేక ల‌క్ష్యాల‌ను వారికి అప్పగిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి కంచుకోట‌లుగా ఉన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కొంచెం క‌స‌ర‌త్తు చేస్తే.. బ‌లోపేతం అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్న చంద్రబాబు ఆదిశ‌గా అడుగులు వేశార‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అటు చిత్తూరు, ఇటు క‌డ‌ప ప‌రిధిలోకి వ‌చ్చే రాజంపేట పార్లమెంట‌రీ జిల్లాను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఈ పార్లమెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌గా రెడ్డెప్పగారి శ్రీనివాస‌రెడ్డిని నియ‌మించారు.మ‌రి ఆయ‌న బ‌లాబ‌లాలు ఏంటి ? నిజంగానే ఇక్కడ అత్యంత బ‌లంగా ఉన్న వైసీపీ కుటుంబం పెద్దిరెడ్డి ఫ్యామిలీకి, ముఖ్యంగా ఎంపీ మిథున్‌రెడ్డికి ఈయ‌న చెక్ పెడ‌తారా ? అన్నదానిపై ఇప్పుడు కొత్త చ‌ర్చలు అక్కడ మొద‌ల‌య్యాయి. శ్రీనివాస‌రెడ్డి జిల్లా అధ్యక్ష హోదాలో పనిచేశారు. 2014 ఎన్నికలు నుంచి ఇప్పటి వరకు ఆయనే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జిల్లా పార్టీ అధ్య క్షుడిగా పనిచేసిన తనకు పార్లమెంట్‌ స్థాయిలో కాకుండా రాష్ట్ర కమిటీలో అవకాశం ఇవ్వాలని వాసు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి నట్లు తెలిసింది. కానీ, ప‌ట్టుబ‌ట్టి.. చంద్రబాబు ఆయ‌న‌కు పార్లమెంట‌రీ జిల్లా బాధ్యత‌ల‌నే అప్పగించారు.ఇక‌, శ్రీనివాస్ కుటుంబంలో ఆయ‌న తండ్రి రాజగోపాల్‌రెడ్డి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆయన సోదరుడు ఆర్‌.రమేష్‌రెడ్డి ఎమ్మెల్యేగా ( ర‌ద్దయిన ల‌క్కిరెడ్డిప‌ల్లి నుంచి) గెలిచారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ మిథున్‌రెడ్డిని ఢీకొట్టి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌ రాయులు లాంటి సీనియర్‌ నాయకులకు కులుపుకుని పార్టీని బలోపేతం చేయడంలో శ్రీనివాసరెడ్డి సమర్థవంతంగా పనిచేస్తే.. ఒకింత గుర్తింపు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ, బ‌త్యాల అందుకు స‌సేమిరా అనే ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.అదే స‌మ‌యంలో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, చిత్తూరు జిల్లాలో మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజక వర్గాల ఇన్‌చార్జీలను కూడా కలుపుకొని పోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఇక్కడ అసంతృప్తుల జాబితా ఎక్కువ‌గా ఉంది. చిత్తూరు జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో నేతలు అస‌లు పార్టీని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. మ‌రో ప‌క్క కొంద‌రు నేత‌లు లోపాయికారీగా వైసీపీ నేత‌ల‌తో క‌లిసిమెలిసి సాగుతూ.. ప‌నులు చేయించుకుంటున్నారు.ఈ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో అధికార వైసీపీలో ఎంపీ మిథున్ రెడ్డి హ‌వా ఎక్కువ‌. చిత్తూరు జిల్లాలో పీలేరు, పుంగ‌నూరు, తంబ‌ళ్లప‌ల్లిలో ఈ కుటుంబ స‌భ్యుల హ‌వా ఎక్కువ‌. ఈ పార్లమెంటు ప‌రిధిలో టీడీపీని పెద్దిరెడ్డి ఫ్యామిలీ పూర్తిగా నిర్వీర్యం చేస్తోన్న నేప‌థ్యంలోనే చంద్రబాబు మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డిని కాస్తైనా కంట్రోల్ చేసేందుకే అదే వ‌ర్గానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యత‌లు ఇచ్చినా బాబు వేసిన ఈ ఎత్తు స‌క్సెస్ అవ్వడం అంత వీజీ కాద‌నే చెప్పాలి.

Related Posts