YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ధ‌ర‌ణి...అనుమానాల గ‌ని

ధ‌ర‌ణి...అనుమానాల గ‌ని

వ‌రంగ‌ల్‌, అక్టోబ‌రు 12, 
ధరణి.. ఆస్తుల నమోదుపై నగరవాసులు, పట్టణవాసుల్లో అనేక అనుమానాలున్నాయి. క్షేత్రస్థాయిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునే క్రమంలో నగరవాసులు అడిగే ప్రశ్నలకు సిబ్బంది సైతం సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. పలు వర్గాలు ఆస్తుల నమోదుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు, ప్రజలకు దీనిపై అవగాహన కల్పించకుండానే నమోదు ప్రక్రియను ఈనెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు, సిబ్బందిలో అయోమయం నెలకొంది. ఇదిలా ఉంటే ఆస్తుల నమోదుపై అనుమానాల్ని నివృత్తి చేసే వారు లేక ప్రజలు సైతం అయోమయంలో పడుతున్నారు. దీంతో గడువును ఈనెల 20 వరకు పెంచారు. గతంలో భూముల సర్వే పేరిట రాష్ట్ర ప్రభుత్వం పార్ట్‌-ఏ, పార్ట్‌-బీ గా భూముల్ని విభజించి పార్ట్‌-ఏ కేటగిరీ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు అందచేసిన విషయం విధితమే. పార్ట్‌-బీ కేటగిరి భూ వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పరిష్కరించలేకపోయింది. ఈ క్రమంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి ఆర్‌డీఓ పేషీ కోర్టులను రద్దు చేసి, భూ వివాద కేసులను ట్రిబ్యునళ్లకు బదిలీ చేయడం పట్ల రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వే నేపథ్యంలో భూములను పార్ట్‌ ఎ, పార్ట్‌ బి కేటగిరీలుగా భూములను విభజించి పార్ట్‌ ఎ వ్యవసాయ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసిన విషయం విదితమే. నాటి నుంచి నేటి వరకు పార్ట్‌ బి కేటగిరీ భూముల వివాదాలను నేటికీ పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఆస్తుల నమోదుకు 'ధరణి' పోర్టల్‌ను ప్రారం భించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేయడానికి ఈ పోర్టల్‌ను వినియోగించుకుని ఇంటింటి సర్వేను చేపట్టారు. ఆస్తుల నమోదుపై అధికారులు, సిబ్బందికి ఇటు ప్రజలకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ క్రమంలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు వల్ల వారసత్వ భూ వివాదాలు సులభంగా పరిష్కార మవుతాయని, వెంటనే మ్యుటేషన్లు పూర్తి చేసుకునే అవకాశముంటుందని చెబుతున్నారు. ఉమ్మడి ఆస్తు లు మ్యుటేషన్‌ కాక చాలా పెండింగ్‌లో వున్నాయని, ధరణిలో ఆస్తుల నమోదుతో వీటికి పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం కొంత ప్రచారం చేస్తున్నా ప్రజల్లో వున్న అనుమానాలను నివృత్తి చేయడంలో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు విఫల మయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, అధికారులకు దీనిపై అవగాహన కల్పించకుండానే హడావుడి చేసి ఈనెల 15వ తేదీలోపు ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో అనేక అను మానాలు వ్యక్తమవుతుండడంతో ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్న క్రమంలో ఆస్తుల నమోదును ఈనెల 20వ తేదీ వరకు గడువు పెంచారు.ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తులను నమోదు చేయించుకోవడంపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. ఆస్తుల నమోదుతో ఎలాంటి భద్రత లభిస్తుంది ? ఎలాంటి ప్రయోజనాలుంటాయి ? ఎలాంటి నష్టాలుంటాయి ? అనే విషయాలు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా ఆస్తుల నమోదుతో ఆదాయపన్ను అది óకంగా పడే అవకాశముందని సైతం భావిస్తున్నారు. ఇంటింటి సర్వేలో ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన వివా దాలను ఎలా పరిష్కరిస్తారనే విషయంలో స్పష్టత లేదు. గతంలో భూముల సర్వేలో పార్ట్‌ బీ భూములను నేటికీ పరిష్కరించకపోవడంతో వ్యవసాయేతర ఆస్తుల వివాదా లను ఎలా పరిష్కరిస్తారనే విషయంలో అధికారుల నుండి సమాధానాలు రావడం లేదు. దీంతో ధరణిపై అనుమా నాలను నివృత్తి చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం విఫలమైంది. గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో పలు వర్గాలు ఆస్తుల నమోదులో విముఖత వ్యక్తం చేస్తున్నారు.
కొత్త రెవెన్యూ చట్టం కొత్త చిక్కులను తెచ్చి పెట్టే అవకాశముంది. ఈ చట్టంతో రెవెన్యూ డివిజనల్‌ అధికారులు (ఆర్‌డిఓ) పరిధిలో పేషీ కోర్టులు రద్దయ్యాయి. పలు భూ వివాదాలు ఆర్‌డిఓల పరిధిలో ముఖాముఖిగా చర్చలు జరిపి పరిష్కరించే వారు. ఇవి రద్దు కావడంతో ఈ భూ వివాదాలను ట్రిబ్యునళ్లకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే భూ వివాదాల పరిష్కారానికి ఏండ్ల తరబడి కోర్టుల చుట్టు తిరిగే పరిస్థితి వుంది. ఇప్పటికే ఆర్‌డిఓల పరిధిలో కొలిక్కి వచ్చి తీర్పునిచ్చే దశలో వున్న అనేక కేసులు ఈ కోర్టుల రద్దుతో పెండింగ్‌లో పడ్డాయి. ఈ కేసులు ట్రిబ్యునళ్లకు బదిలీ అయితే రైతులకు ఇబ్బందులు తప్పవు. పాత రెవెన్యూ చట్టంలో లోపాలు అధికంగా వున్నాయని, అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని భావించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చింది. ఈ కొత్త రెవెన్యూ చట్టం భూ వివాదాలను పరిష్కరించడంలో విఫలమైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఎదురవుతుంది.

Related Posts