హైద్రాబాద్ అక్టోబరు 12,
రఘురామ కృష్ణం రాజు.. వైసీపీని టార్గెట్ చేసే విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటు వైసీపీ లీడర్లు కూడా అదే పార్టీకి చెందిన రఘురామను ఏ మాత్రం టోలరేట్ చేయడం లేదు. ఎంపీ రఘురామ కూడా ఘాటు కామెంట్స్ బానే చేస్తున్నారు. తనని అరెస్ట్ చేయించడమే సీఎం జగన్ లక్ష్యమని.. అప్పటి వరకూ ఆయన నిద్రపోరు అంటున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ ప్రజా అవసరాలను గాలికి వదిలేశారని కమెంట్స్ చేశారు. ఆఫీసర్లు కూడా వాళ్ల సొంత కాంటాక్ట్స్ వాడుతూ అవుటాఫ్ లా మూవ్ అవుతున్నారని తనపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని కామెంట్స్ చేశారు.ఇక వైసీపీ లీడర్లు కూడా రఘురామ కృష్ణం రాజుని టార్గెట్ చేస్తూ చిర్రు బుర్రులాడుతున్నారు. ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఎంపీ రఘురామ కృష్ణం రాజుని విమర్శిస్తున్నారు. రఘురామ కృష్ణం రాజుని ఎంపీని చేసి గౌరవిస్తే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేక పోయారంటూ విమర్శించారు..వైసీపీ లీడర్ మార్గాని భరత్ రామ్. మొదటి సారి ఎంపికైనా స్టాండింగ్ కమిటీలో స్థానం కల్పించి.. మర్యాద ఇచ్చారని.. ఆ విషయం ఆయన గుర్తు పెట్టుకోవాలన్నారు. రఘురామ కృష్ణం రాజు సభ్యత్వం రద్దు చేయించి..అనర్హత వేటు వేయిస్తాం అన్నారు. సీటు ఇచ్చి.. గెలిపించిన పార్టీని మాటి మాటికీ విమర్శించడం కరెక్ట్ కాదన్నారు.ఇక రఘురామ కృష్ణం రాజు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. అనర్హత వేటు గురించి స్పీకర్ దగ్గర కంప్లైంట్ చేసినా ఆగడం లేదు. గవర్నమెంట్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. పాలనా పరమైన కమెంట్స్ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. తలో మాటా అనుకుంటూ.. పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇక చంద్రబాబు కేసుల వ్యవహారం ఎలాగూ ఉంది. దీంతో పాటు సుప్రీం జస్టిస్ పై జగన్ రాసిన లేఖ ఇష్యూ కూడా నడుస్తోంది. ఇటు ప్రతి పక్షాలతో పాటు.. అధికార పక్షం లీడర్లు కూడా పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.
ఏపీలో రాజకీయం హీటెక్కింది. అది న్యాయ వ్యవస్థకి లింక్ అయి ఉంది. అది కూడా సుప్రీం కోర్టు కావడంతో నేషనల్ ఇష్యూ అయింది. ఇన్నాళ్లూ సైలెంట్ గానే ఉన్నాం.. ఇక మీదట ఊరుకోం అన్నట్లు ఉంది యవ్వారం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ రాసిన లేఖతో పొలిటికల్ హీట్ కాస్త కోర్టులకి తగిలింది. సుప్రీం కోర్టు ఇష్యూ కావడంతో నేషనల్ వైడ్ గా వైబ్ వచ్చింది. న్యాయ వాదులు, లీడర్లు, పెద్దలు అందరూ తలా ఓ మాట అంటున్నారు. ట్వీట్లతో హీట్ పుట్టిస్తున్నారు.సుప్రీం కోర్టు జస్టిస్ అయిన ఎన్వీ రమణ తీరు పై ఏపీ సీఎం జగన్.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖతో ఇష్యూ స్టార్ట్ అయింది. జస్టిస్ ఎన్వీ రమణ.. రాష్ట్ర హైకోర్టును ప్రభావితం చేస్తున్నారు. ఇక్కడి న్యాయమూర్తులతో చంద్రబాబుకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారని. తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ ప్రజలకి కావాల్సిన మంచి పనులు కానివ్వకుండా చేస్తున్నారని. అన్నిటిపైనా స్టేలు ఇస్తూ ఆపుతున్నారని లేఖ రాశారు సీఎం జగన్. గతంలో టీడీపీ సలహాదారుగా పని చేసిన ఎన్వీ రమణ ఇప్పుడు సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్నారు. ఆ పరిచయాలతో టీడీపీ అండ్ జస్టిస్ కలిసి.. ఏపీ ప్రభుత్వాన్ని సీఎంను కావాలనే ఇబ్బంది పెడుతున్నారనేది లేఖ ఉద్దేశం. దాని కోసం రాష్ట్ర హైకోర్టులోని ఇద్దరు జడ్జిల సపోర్ట్ తీసుకుంటున్నారని.. లేఖ రాశారు. దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి స్పందించి యాక్షన్ తీసుకోవాని రిక్వస్ట్ చేశారు.సీఎం జగన్ రాసిన లేఖతో తలో మాటా అంటున్నారు. సుప్రీం వర్సెస్ సీఎం అనే వాళ్లు.. జగన్ ఇక తగ్గేదే లేదు అనే వాళ్లు. లేఖ కరెక్ట్ కాదు అనే వాళ్లు ఉన్నారు. ఏపీలో పెద్ద కథే నడుస్తోంది అని కామెంట్స్ చేస్తున్న లీడర్లూ ఉన్నారు.