విశాఖపట్టణం, అక్టోబరు 12,
దేవుడే సూత్రదారి అందరం పాత్ర దారులం అంటుంటాం. కానీ.. ఇక్కడ మాత్రం దేవుడి ముందే నాటకాలు నడుస్తున్నాయి. ఆయన క్రియేట్ చేసిన పాత్రలు ఆయన పర్మిషన్ లేని నాటకాలు ఆడుతున్నాయట. అసలు సింహాచలం గుడిలో ఏం జరుగుతోంది. ఎందుకు అందరూ గుట్టుగా మేన్ టేన్ చేస్తున్న గుప్పు గుప్పున పొగలొస్తున్నయ్.రెండు మూడు రోజులుగా ఓ వార్త ఫుల్లుగా షికార్ కొడుతుంది. గుడి దాటి ఊళ్లోకొచ్చింది. సింహాచలం స్వామి వారి కానుకల్లో కొన్ని మిస్ అయ్యాయట. కొన్ని అంటే కాసిన్ని కూసిన్ని కాదు. 50 బస్తాల కానుకల్లో.. 30 బస్తాల కానుకలు మిస్ అయ్యాయట. దీనిపై వార్తలు బయటికొస్తున్నాయి. మరి పుకార్లా నిజాలా అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఆలయ అధికారుల్ని కదిలించినా సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారట. పోలీసుల దాకా విషయం వెళ్లినా అఫీషియల్ గా మాత్రం ఎలాంటి కంప్లైంట్ లేక పోవడంతో.. వాళ్లూ అదే చెబుతున్నారు. ఆలయ సీఈవో లు కూడా సైలంట్ గా ఉన్నారని, కాంటాక్ట్ లోకి రావడం లేదని, ఎన్ని సార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవడం లేదనీ చెబుతున్నారు.మరి ఈ కానుకల కథేందయ్యా అంటే.. సింహాచలం హుండీలో చేతికడియాలు, ఇత్తడి కోడె దూడల బొమ్మలు, ఇత్తడి గంటల బొమ్మలు వేస్తుటారు. వాటన్నీటినీ ఏటా వేలం వేస్తారు. లాస్ట్ టైమ్ వేలం వేసిన వ్యాపారి కొంత తరుగు కోరారట. అందుకే వాటిని ఆలయ ప్రాంగణంలోనే భద్రపరిచారట. మొత్తం 50 బస్తాలు భద్రపరిస్తే వాటిలో 30 మిస్ అయ్యాయట. మరి 30 మిస్ అయ్యాయా.. వ్యాపారి తీసుకెళ్లాడా అనేదానిపైనా క్లారిటీ లేదట. అసలే సీసీ కెమెరాలు.. సిబ్బంది ఎప్పుడూ ఉంటారు. ఇంత మందికి తెలీకుండా తీసుకెళ్లడం అంటే ఉత్తి మాట కాదు. కానీ.. జనం మాత్రం తలా ఓ మాటా మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఆలయ ఆఫీసర్లు కానీ.. వ్యాపారి కానీ రెస్పాండ్ అయ్యే వరకు ఎలాంటి క్లారిటీ రాదు.