అమరావతి అక్టోబరు 12,
అమరావతికి భూములిచ్చిన రైతులు ఉద్యమం చేపట్టి 300 రోజులయింది. రాజధానిగా అమరావతిని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించగా, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సమర్ధించారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనకు పవిత్ర జలాలు, పార్లమెంటు ఆవరణలోని మట్టి తీసుకొచ్చి అమరావతి మరో ఢిల్లీ కావాలని ఆకాంక్షించారని మాజీ మంత్రి సోమిరెడ్డి గుర్తు చేసారు. ఇప్పుడు ఆ రాజధానిని మార్చడం తగదని 300 రోజులుగా రైతులు పిల్లాపాపలతో ఉద్యమం చేయాల్సిరావడం బాధాకరం. సీఎం, ప్రతిపక్ష నాయకుడు సమర్ధించాక ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మారుస్తామంటే వ్యవస్థలపైనే నమ్మకం పోయే పరిస్థితి..ప్రజలు ఇక ఎవరిని నమ్మాలి. అమరావతే రాజధాని అని నమ్మి పెట్టుబడులు పెట్టిన యూనివర్సిటీలు, కంపెనీలు, వ్యాపారవేత్తలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏమైపోవాలి. రాజధాని విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి మనస్సు చేసుకుని ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అయన అన్నారు.