అమరావతి అక్టోబర్ 12
రాష్ట్ర పునర్విభజన చట్టం అనేది కేంద్రమే రూపొందించింది. ఎవరైనా ఆ చట్టాన్ని గౌరవించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. రాజధాని అనే అంశంలో కేంద్రానికి సంబంధం లేదని చెప్పడం కరెక్ట్ కాదని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. దీని పై లా సెక్రటరీ ని కూడా కలిసి అన్నీ వివరించాం. అమరావతి ని ఏకైక రాజధాని గా ప్రకటించే వరకు మేము అండగా ఉంటాం. ముప్పై వేల మంది రైతులు తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే... న్యాయ స్థానంలో న్యాయం జరుగుతుందని అయన అన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పి ప్రజలను మోసం చేశారు. కేసులు , ఇబ్బందులు పెట్టినా మహిళల పోరాటం ఆదర్శనీయం. రాజధాని ఇక్కడే ఉండాలని ముందు నుంచీ ఎవరూ అనుకోలేదు. రాష్ట్రం లో అన్ని ప్రాంతాల ప్రజలకు అనువుగా ఉండాలనే అమరావతి ని రాజధాని గా చంద్రబాబు ప్రకటించారు. ఆరోజు మద్దతు పలికిన జగన్ .. ఇప్పుడు మోసం చేశారు. రైతులను తిడుతున్న మంత్రులు అన్నమే తుంటున్నారా. రైతులు పండించే పంట తింటూ బతికేవాళ్లు రైతులను అవమానిస్తారా. అమరావతి లో గ్రాఫిక్స్ అన్నవారు ఆ గోడలు ఎక్కి దూకితే వాస్తవం తెలుస్తుందని అన్నారు. ఇన్నివరదలు వచ్చినా అమరావతి లో చుక్క నీరు లేదు. అమరావతి అనే పసి బిడ్డను చంపాలని జగన్ కుట్రలు చేస్తున్నారు. సిబిఐ కేసులు అన్నవారు... ఎన్ని అక్రమాలు బయట పెట్టారు. టిడిపి ప్రభుత్వం లో అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు తెచ్చాం. జగన్ పాలనలో ఒక్క పరిశ్రమ వచ్చిందా.. ఉన్నవి కూడా పోతున్నాయి. రాజధాని విషయంలో రాజకీయం చేయడమే జగన్ పని. విశాఖ ప్రజలు కూడా ఆలోచన చేయాలి...జగన్ ఒక్క అభివృద్ధి చేశాడా అని ప్రశ్నించారు.
ప్రశాంతంగా ఉండే విశాఖలో భూ కబ్జాలు, దందాలు చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వం తెచ్చిన కంపెనీలు కూడా వెళ్లిపోయాయి. మరో బీహార్ గా ఎపిని మార్చాలని చూస్తున్నారు. ఎవరైనా తప్పు అని ప్రశ్నిస్తే అన్యాయం గా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా అమరావతి ని మార్చలేరు. నేడు న్యాయ వ్యవస్థ పై కూడా నిందలు వేస్తున్నారు. ఒక మెంటల్ వ్యక్తి తో మనం పోరాటం చేస్తున్నాం. తండ్రి శవాన్ని ఎదురు పెట్టుకుని సిఎం కుర్చీ కోసం సంతకాలు చేయించిన చరిత్ర జగన్ ది. ఆయన తండ్రి మరణం తట్టుకోలేక చనిపోయారంటూ ఓదార్పు యాత్ర చేశాడు. అదే అమరావతి కోసం అసువులు బాసితే.. కనీసం విచారం కూడా వ్యక్తం చేయ లేదు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ అంశాలను ఆలోచించాలి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే నినాదంతో జగన్ ను ఇంటికి పంపే వరకు మన పోరాటం కొనసాగాలి.కరోనా కేసుల్లో, అప్పుల్లో మాత్రం రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు. మరి ఆ డబ్బు అంతా ఎటు వెళుతుందో జగన్ కే తెలియాలని అన్నారు.