YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉత్త‌రాంధ్ర‌లో రాజీనామాల గోల‌

ఉత్త‌రాంధ్ర‌లో రాజీనామాల గోల‌

విశాఖ‌ప‌ట్ట‌ణం, అక్టోబ‌రు 13, 
అందరూ పదవులు కావాలని కోరుకుంటారు. కానీ పదవులు వచ్చి కుదురుకున్న వారు తాము రాజీనామా చేస్తామని అంటున్నారు. నిజానికి రాజకీయ నాయకుడు అనకూడని,వినకూడని పదం ఏదైనా ఉందంటే అది రాజీనామావే. కానీ ఉప ముఖ్యమంత్రి అయి మూడు నెలలు కూడా కాకముందే ధర్మాన కృష్ణ దాస్ రాజీనామా అంటున్నారు. అదే వరసలో కొత్త మంత్రి సీదరి అప్పలరాజు కూడా రాజీనామాకు రెడీ అంటూ సవాల్ చేస్తున్నారు. మరి రాజీనామాలు చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమా అని అంతా అంటున్నారు. నిజానికి ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజా సేవ చేయడానికి కానీ రాజీనామాలు చేయడానికి కాదు కదా అన్న మాట కూడా వినిపిస్తోంది.మెత్తని వాడు, నిదానస్తుడు అనుకున్న పెద్ద మనిషి, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేస్తాను అంటున్నారు. అది కూడా విశాఖ రాజధానితో ముడిపెట్టి రాజీనామా అంటున్నారు. చంద్రబాబునే తనకు ప్రత్యర్ధిగా బరిలోకి దిగమంటున్నారు. ఇద్దరం చూసుకుందామని రెచ్చగొడుతున్నారు. సరే విశాఖ పాలనారాజధాని కావాలని ధర్మాన కృష్ణ దాస్ కి ఉంది. ఆయన కీలకమైన పదవిలో ఉన్నారు. ఆ ప్రక్రియ ఏదో రాజ్యాంగ బద్ధంగా జరిపించుకునేందుకు దారులు వెతకాలి కానీ ఇలా వీధిన పడితే ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్న వస్తోంది. పైగా చంద్రబాబుని ముగ్గులోకి లాగితే మరింత రచ్చ అవుతుంది తప్ప ఒరిగేది ఏముంటుంది అని కూడా అంటున్నారు.ఇక ఈయన బాటలో శిష్యుడు, కొత్త మంత్రి సీదరి అప్పలరాజు తయారయ్యారు. ఆయన కూడా గురువు ధర్మాన కృష్ణ దాస్ ఎటూ రాజీనామా అంటున్నారు కదా అని తానూ రాజీనామాకు రెడీ అంటున్నారు. పలాసా నుంచి చంద్రబాబుని పోటీ చేయమంటున్నారు. మీ పెతాపం, మా పతామం జనం ముందు తేల్చుకుందామని కూడా చెబుతున్నారు. కానీ సీదరి అప్పలరాజు ఎమ్మెల్యేగా గెలిచింది ఇదే ఫస్ట్ టైం. పైగా మంత్రి అయి ముచ్చటగా మూడు నెలలు కాలేదు. ఇంతలోనే అంత రాజకీయ వైరాగ్యం ఏల మంత్రి గారూ అని జనమే అంటున్నారు. ఆవేశం పాలు తగ్గించుకోవాలని కూడా హితవుసమస్యలు శ్రీకాకుళం జిల్లాను పట్టిపీడిస్తున్నయి. పైగా భావనపాడు పోర్టు పనులు చూడాల్సిన కర్తవ్యం సీదరి అప్పలరాజు మీదనే ఎక్కువగా ఉంది. మరో వైపు చూసుకుంటే జిల్లాలో అభివ్రుద్ధి అన్నది లేదు. నిధులు తెచ్చి ప్రగతి బాటన జిల్లాను నడిపించాలి. ఆగిపోయిన పనులు అలాగే ప్రతిపాదించిన అనేకమైన ప్రాజెక్టులను మళ్ళీ పరుగులు పెట్టించాలి. కానీ ఇవన్నీ మరచి టీడీపీ మీద సవాళ్ళు చేసుకోవడం ఒకరి మీద ఒకరు మీడియా మీటింగులు పెట్టి రెచ్చిపోవడం, పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేసుకోవడం వల్ల అధికార పక్షానికే ఎక్కువ నష్టమని అంటున్నారు. టీడీపీ ఇలాగే విమర్శలు చేస్తుంది, దానికి జవాబు చెప్పే విధానం ఇది కాదు అని అంటున్నారు. తరచూ రాజీనామాలు అంటే చివరికి అదే జరిగి మాజీలుగా మారుతారని కూడా హెచ్చరిస్తున్నారు.

Related Posts