YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యేలు...గుస్సా...

ఎమ్మెల్యేలు...గుస్సా...

విజ‌య‌వాడ‌, అక్టోబ‌రు 13, 
అదేంటి..? సొంత పార్టీ ఎమ్మెల్యేలు.. జ‌గ‌న్‌పై గుస్సాగా ఉన్నారా ? ఆయ‌న‌పై కారాలు మిరియాలు నూరుతున్నారా ? పైకి చెప్పలేక‌ లోలోన కుమిలి పోతున్నారా? అంటే.. ఔనండీ ఔను ! అంటున్నారు వైసీపీ నాయ‌కులే..! పీత‌క‌ష్టాలు పీత‌వి .. అంటున్నార‌ట వారు. “మేం ఇంత డ‌మ్మీలు అయిపోతాం అని క‌ల‌లో కూడా అనుకోలేదు“ అని ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆఫ్‌ది రికార్డుగా ఇటీవ‌ల మీడియాతోనే వ్యాఖ్యానిస్తున్నారు. వారి మాట‌ల్లోనే వారి అస‌హ‌నం క‌ట్టలు తెంచుకుంటోంది. ఎమ్మెల్యేల ఈ వ్యాఖ్యలు జ‌గ‌న్ వ‌ర‌కు చేరాయ‌ని తాజా స‌మాచారం. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? చాలా మంది ఎమ్మెల్యేలు డ‌మ్మీలం అనేంత మాట ఎందుకు అనాల్సి వ‌చ్చింది ? అంటే.. రెండు ప్రధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.ఒక‌టి.. జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన స‌చివాల‌యాలు..వ‌లంటీర్ వ్యవ‌స్థ. గ‌త ఏడాది అక్టోబ‌రు 2న ప్రతిష్టాత్మకంగా తీసుకువ‌చ్చిన ఈ వ్యవ‌స్థను అంతే ప్రతిష్టాత్మకంగా ముందుకు న‌డిపిస్తున్నారు జ‌గ‌న్‌. అయితే, ఇది ప్రభుత్వానికి, ప్రజ‌ల‌కు మేలు చేసినా.. ప‌రోక్షంగా ఎమ్మెల్యేల‌ను, అధికార పార్టీ ప్రజా ప్ర‌తినిధుల‌ను డ‌మ్మీ చేసింద‌నేది విమ‌ర్శ. ప్రజ‌ల‌కు ఏది కావాల‌న్నా.. గ‌తంలో ఎమ్మెల్యేలు, ఎంపీల వ‌ద్దకు వెళ్లేవారు. త‌మ గోడు చెప్పుకొనేవారు. దీంతో ఎమ్మెల్యేలు ఆయా ప‌నులు చేసి పెట్టి ప్రజ‌ల్లో సానుభూతి కోణం సంపాయించుకుని. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో వాడుకునేవారు అయితే, ఇప్పుడు వ‌లంటీర్ వ్యవ‌స్థ వ‌చ్చాక‌.. అన్నీ వలంటీర్లే చూస్తున్నారు.దీంతో ప్రజ‌లు ఎవ‌రూ కూడా ఎమ్మెల్యేల‌ను పెద్దగా ఖాత‌రు చేయ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు టీడీపీ ప్రభుత్వంలో చిన్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లేదా, ఎవ‌రికి అయినా పెన్షన్ వ‌చ్చినా స్వయంగా ఎమ్మెల్యేలు ఆ చెక్కులు ఇచ్చి నానా హంగామాతో పబ్లిసిటీ చేసుకునేవారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల‌కు చెందిన వారు ల‌బ్ధిదారులుగా ఉన్నా వారిని స్వయంగా నాటి టీడీపీ ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించుకునేవారు. ఇప్పుడు అవేవి లేక‌పోవ‌డం వైసీపీ ఎమ్మెల్యేల‌కు న‌చ్చడం లేదు. అదే స‌మ‌యంలో ప్రభుత్వం కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావ‌డం, టోల్ ఫ్రీ నెంబ‌ర్లను ఇవ్వడం వంటి ప‌రిణామాల‌తో ప్రజ‌ల‌కు త‌మ‌కు ఉండే సంబంధాలు చాలా వ‌ర‌కు త‌గ్గిపోయాయ‌నేది వారి ఆవేద‌న.ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల జ‌గ‌న్‌.. ఈ వ్యవ‌స్థను తీసుకువ‌చ్చి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా చ‌ప్పట్లతో వ‌లంటీర్లను అభినందించాల‌ని పిలుపు ఇచ్చినా.. ఎమ్మెల్యేలు ఎవ‌రూ కూడా స్పందించ‌లేదు. దీనిపై ఇంటిలిజెన్స్ కూడా జ‌గ‌న్‌కు స‌మాచారం ఇచ్చింద‌ని అంటున్నారు. ఇలా ఎమ్మెల్యేలు ఎందుకు గుస్సాగా ఉన్నారో.. జ‌గ‌న్ తేల్చేందుకు సిద్ధప‌డుతున్నార‌ని అంటున్నారు.ఇక‌, మ‌రో కీల‌క కార‌ణం.. అవ‌స‌రం లేకున్నా.. జగన్ ఇత‌ర పార్టీల నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవ‌డం. వారి పెత్తనం ఎక్కువ కావ‌డం. పార్టీ అధిష్టానం నుంచి కూడా ఎలాంటి నియంత్రణా ఆదేశాలు లేకుండా పోవ‌డంతో నాయ‌కులు తీవ్రస్థాయిలో త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే..త‌మ‌కు క‌ష్టమ‌ని.. ఎవ‌రికో ఒక‌రికి ప‌గ్గాలు అప్పగించాల‌ని ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమిడే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. ఇక ఇత‌ర పార్టీల నేత‌ల‌ను పార్టీలో చేర్చుకునే విష‌యంలో ఎమ్మెల్యేల‌కు న‌చ్చక‌పోయినా ఎంపీలు చేర్చేసుకుంటున్నారు. ఇవి కూడా గ్రూపుల‌కు మ‌రింత ఆజ్యం పోసేలా ఉంటున్నాయి. మొత్తానికి ఈ రెండు ప‌రిణామాలు కూడా వైసీపీలో హాట్ టాపిక్‌గా మార‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో ? చూడాలి.

Related Posts