YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

శేషాచ‌లంలో స్మ‌గ్ల‌ర్లు వేట

శేషాచ‌లంలో స్మ‌గ్ల‌ర్లు వేట

తిరుప‌తి, అక్టోబ‌రు 13, 
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల అలజడి మొదలైంది. లాక్ డౌన్ సమయంలో ప్రశాంతంగా ఉన్న అడవిపై మళ్లీ గొడ్డలి వేటు పడుతోంది. తమిళనాడు నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తున్నారు. స్మగ్లర్ల అడుగుల చప్పుడుతో ప్రశాంత శేషాచల ఫారెస్ట్ విలవిలలాడుతోంది. పచ్చని అడవిని నాశనం చేస్తున్నారు. విలువైన చెట్లను నరికేస్తున్నారు. కొందరి కాసుల కక్కుర్తి శేషాచల అడవికి శాపంగా మారింది. ఎర్రచందనం దుంగలను దర్జాగా బోర్డర్ దాటించేస్తున్నారు. రెండు దశాబ్ధాల కాలంగా జరుగుతున్న అక్రమ వ్యాపారమిది. ఇప్పటి వరకు లక్షల టన్నుల ఎర్రచందనం దేశం దాటిపోయింది. లక్షల కోట్ల రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.  అటవీశాఖ, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఎర్రచందనం దొంగలు వెనక్కితగ్గడం లేదు. వేల మందిని అరెస్టు చేశారు. వందల సంఖ్యలో నేరస్తులను గుర్తించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్లు కూడా జరిపారు. ఐనా ఈ అక్రమ దందా ఆగడంలేదు. అరెస్టయిన వారిలో 98శాతం మంది తమిళనాడు రాష్ర్టానికి చెందిన వారే ఉన్నారు. తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, సేలం పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లను నరికే కూలీలు దండిగా దొరుకుతున్నారు. కొన్ని గ్రామాలైతే దీనినే వృత్తిగా చేసుకున్నాయి. అందుకే స్మగ్లర్లు కూలీలను కొత్త అల్లుళ్లుగా చూసుకుంటున్నారు లాక్ డౌన్ శేషాచల అడవికి వరంగా మారింది. కానీ ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులతో స్మగ్లర్లు మళ్లీ వేట మొదలుపెట్టేశారు. వారం రోజులుగా అడవుల్లోకి స్మగ్లర్లు వస్తున్నట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఆదిలోనే ఎర్రచందనం దొంగలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. స్మగ్లర్ల ఆటకట్టించడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. అడవిలోకి ఎంటర్ కావడానికి ఉన్న అన్నిమార్గాలపై నిఘా పెంచారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. మరీ ఇప్పటికైనా ఎర్రచందనం దొంగలు వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి.

Related Posts