YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క‌మ‌లం వైపు గ‌ల్లా చూపు

క‌మ‌లం వైపు గ‌ల్లా చూపు

తిరుప‌తి‌, అక్టోబ‌రు 13,
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పొలిట్ బ్యూరో నుంచి తప్పు కోవడానికి వయసు మీద పడటమే కారణమా? లేక మరే కారణమేదైనా ఉందా? అన్న చర్చ టీడీపీలో జరుగుతుంది. గల్లా అరుణ కుమారిది అంత సులువుగా వదులుకునే తత్వం కాదు. అలాంటిది తన కుమారుడు ఎంపీగా ఉన్న సమయంలో పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరో స్థానానికి రాజీనామా చేయడానికి అసలు కారణం వేరే ఉందని అంటున్నారు.  గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం ఉన్నారు. అనేక మంత్రి పదవులను పొందారు. చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించారు. కానీ కొడుకు రాజకీయాల్లోకి వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా అడ్డం తిరిగింది. సొంత జిల్లాలో చోటు లేకుండా పోయింది. అసలు గల్లా అరుణకుమారి దాదాపు పదిహేను నెలల క్రితమే టీడీపీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల వరకూ అధికారంలో ఉండటంతో టీడీపీలో ఉండిపోయారు కానీ లేకుంటే ఎప్పుడో గల్లా అరుణకుమారి పార్టీ మారేవారంటున్నారు.చిత్తూరు జిల్లాలో తనను జీరో చేయడంపై గల్లా అరుణకుారి పార్టీపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబుకు లేఖ రాయడం ఇది కొత్త కాదు. గతంలో కూడా తనను ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలని లేఖ రాశారు. జరుగుతున్న పరిణామాలను బట్టి గల్లా అరుణకుమారి చంద్రబాబుకు లేఖలు రాస్తుంటారు. ఇప్పుడు టీడీపీలో తన కుమారుడు గల్లా జయదేవ్ కు కూడా పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని గల్లా అరుణకుమారి భావిస్తున్నారు.అందుకే గల్లా అరుణకుమారి భారతీయ జనతా పార్టీలో చేరాలని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు కొదవ లేదు. అందుకుని వైసీపీ లో చేరినా టీడీపీలో పరిస్థితులే ఉంటాయి. బీజేపీలో చేరితే తానే ప్రధాన నేతగా మారవచ్చన్నది గల్లా అరుణకుమారి భావనగా ఉంది. రాష్ట్రంలో అధికారంలో రాకపోయినా కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి వ్యాపార కార్యక్రమాలకు ఇబ్బంది ఉండదన్న ఆలోచనలో గల్లా అరుణకుమారి ఉన్నట్లు తెలుస్తోంది. మరి గల్లా బజేపీలో చేరతారా? లేదా? అన్నది మరికొద్దిరోజుల్లోనే తెలియనుంది.

Related Posts