YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మ‌హాకూట‌మీ సీఎంగా తేజ‌స్వీ

మ‌హాకూట‌మీ సీఎంగా తేజ‌స్వీ

పాట్నా‌, అక్టోబ‌రు 13, 
బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే పొత్తులను ఖరారు చేసుకున్న కూటములు అభ్యర్థులను నిర్ణయించే పనిలో పడ్డాయి. బీహార్ ఎన్నికలకు ఇంకా నెలన్నర రోజులు సమయం మాత్రమే ఉంది. అయితే తేజస్వియాదవ్ ను మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరిని సరిపోల్చినప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ సరిపోరన్నది మహాకూటమి నుంచే విన్పిస్తున్న టాక్.మహాకూటమిలో గత ఎన్నికలలో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ ఉండేవి. ఆ ఎన్నికల్లో విజయం సాధించినా అత్యధిక స్థానాలు వచ్చినా ముఖ్యమంత్రి పదవిని లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజస్వి యాదవ్ కు కోరలేదు. దీనికి కారణం అనుభజ్ఞుడైన నితీష్ కుమార్ కూటమిలో ఉండటమే. తనకు ఎక్కువ స్థానాలు వచ్చినా సీఎం పదవి కాకుండా లాలూ యాదవ్ తన కుమారుల కోసం ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు.ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే లాలూ కుమారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిని వ్యతిరేకిస్తూనే మహాకూటమి నుంచి బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి పదవికి కూడా నితీష్ కుమార్ రాజీనామా చేశారు. అయితే బీజేపీ సూచనలతో ఆయన ఎన్డీఏలో చేరి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అదే కుటుంబం నుంచి తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం చర్చనీయాంశమైంది.నితీష్ కుమార్ తో పోలిస్తే తేజస్వి యాదవ్ ఎందులోనూ సరితూగడు. వయసు, అనుభవం ఏమీ లేకుండా తేజస్వియాదవ్ ను ఎన్నికలకు ముందుగానే ముఖ్యమంత్రిగా ప్రకటించడం మహాకూటమి చేసిన అతి పెద్ద తప్పు అని విశ్లేషకులు సయితం అంగీకిస్తున్నారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలో పనిచేయమని ఇప్పటికే కూటమి నుంచి మాంఝీ పార్టీ, ఉపేంద్ర కుశ్వాహ పార్టీలు బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఓటర్లను కూడా దూరం చేసుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Related Posts