అమరావతి అక్టోబరు 13,
తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ అప్రమత్తం చేసారు. కృష్ణ, తూర్పు, పశ్చిమ గోదావరి కలెక్టర్ల, ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తో ఫోన్ లో అయన మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. చెరువులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గండి పడకుండా చూడాలని, రెవెన్యూ, విద్యుత్ సిబ్బంది తో కలిసి తుఫాన్ సహాయ చర్యల్లో పాల్గొనాలని ఇరిగేషన్ అధికారులకు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందోస్తు చర్యలు చేపట్టాలి అని అధికారులకు ఆదేశించారు.