YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎమ్మెల్సీ కవితకు రెవెన్యూ మంత్రి పదవి ఇవ్వాలి టీబీసీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్

ఎమ్మెల్సీ కవితకు రెవెన్యూ మంత్రి పదవి ఇవ్వాలి టీబీసీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్

జగిత్యాల అక్టోబర్ 13 
కొత్త రెవెన్యూ చట్టం సమర్థవంతంగా అమలుకు పరిణతి గల ప్రజా నాయకురాలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేబినెట్ లో చోటుకల్పించి రెవెన్యూ మంత్రి పదవి ఇవ్వాలని టీబీసీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు,వివిధ సంఘాల జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ సీఎం కేసీఆర్ ను కోరారు. మంగళవారం ఆ  జిల్లా సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లో  అనుభవం ఉన్న కవిత కు మంత్రి పదవి ఇస్తే ఎన్నెన్నో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వము లో కవిత లాంటి సమయపాలన, కఠోర దీక్షతో అంకితభావంతో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అవగతం చేసుకుంటూ పనిచేసే సత్తా వుందని పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసి నిరూపించారని గుర్తు చేశారు.రెవెన్యూ శాఖలో సీఎం కేసీఆర్ ఆశించిన విప్లవాత్మక మార్పులు ప్రజలకు ప్రయోజనం కలిగేలా,రెవెన్యూ ఉద్యోగులు, అధికారులతో సమన్వయంతో కొత్త రెవెన్యూ చట్టం సఫలం కావడానికి కవిత సరైన మంత్రి గా రాణిస్తుందని పేర్కొన్నారు. టీ బీసీ ఐకాస రాష్ట్ర కార్యదర్శి బండారి విజయ్,టీ పెన్షనర్స్ జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్,టీ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి  గౌరిశెట్టి విశ్వ నాథం,టీబీసీ మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి కస్తూరి శ్రీమంజరి,మున్నూరుకాపుసంఘం జిల్లా  అధ్యక్షుడు పుప్పాల  గంగాధర్,వివిధ సంఘాల జిల్లా నేతలు కూసరి అనిల్ కుమార్, పుప్పాల కిశోర్ కుమార్,క్యాస  రగునందన్ రెడ్డి,  పుప్పాల     నర్సింగరావు,వొడ్నాల జగన్, చిందం మనోహర్,విద్యాసాగర్,కరుణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related Posts