YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రెండేళ్ల తర్వాత బాలీవుడ్ లోకి ప్రియాంక

రెండేళ్ల తర్వాత బాలీవుడ్ లోకి ప్రియాంక

దేశీ గర్ల్ ఇమేజ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ప్ర‌స్తుతం ప‌లు హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. క్వాంటికో 3 సీరియల్‌తో పాటు ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్, ‘ఎ కిడ్ లైక్ జేక్’ అనే హాలీవుడ్ చిత్రాలు చేస్తుంది. అయితే కొన్నాళ్ళ క్రితం హాలీవుడ్ బాట ప‌ట్టిన ప్రియాంక చోప్రా త్వ‌ర‌లో బాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తుంది. జై గంగాజ‌ల్ (2016) అనే చిత్రం ప్రియాంక‌కి బాలీవుడ్‌లో చివ‌రి మూవీ కాగా, అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న భ‌ర‌త్ అనే చిత్రంలో స‌ల్మాన్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఈ విష‌యాన్ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్వీట్ ద్వారా క‌న్‌ఫాం చేశారు. భ‌ర‌త్ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. స‌ల్మాన్‌తో గ‌తంలో ముజ్‌సే షాదీ కరోగీ, సలామ్‌-ఇ-ఇష్క్‌, గాడ్‌ తుస్సీ గ్రేట్‌ హో చిత్రాల్లో న‌టించింది ప్రియాంక. భ‌ర‌త్ మూవీ స్క్రిప్ట్ న‌చ్చ‌డంతో దీనికి వెంట‌నే ఓకే చెప్పేసింది. సౌత్‌ కొరియన్‌ మూవీ ఒడే టూ మై ఫాదర్‌(2014) చిత్రానికి రీమేక్‌గా భరత్‌ తెరకెక్కబోతోంది. ఈ మూవీని 2019 ఈద్‌ సందర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. అయితే ఈ మూవీ త‌ర్వాత మ‌ళ్ళీ హాలీవుడ్‌కి వెళ్ళ‌నంటుంద‌ట ప్రియాంక చోప్రా. భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ బయోపిక్ అమీర్ ఖాన్ చేయనుండగా, ఇందులో ఆయన భార్య పాత్రలో ప్రియాంక చోప్రా నటించనుందని టాక్. సారే జహాసే అచ్ఛా అనే టైటిల్ని ఈ మూవీకి ఫిక్స్ చేశారని సమాచారం.దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Related Posts