విశాఖపట్టణం అక్టోబర్ 13
విశాఖ తీరంలో భారీ తుఫాన్ తీరం దాటి వర్షాలు జోరుగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సముద్రంలో ప్రయాణిస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన ఓ వ్యాపార నౌక భారీ ఈదురు గాలులకు విశాఖ తీరానికి కొట్టుకు వచ్చింది. విశాఖ తెన్నేటి పార్క్ సమీపంలో ఈ భారీ నౌక ఒడ్డుకు చేరింది. గాలి తీవ్రతకు ఒడ్డుకు చేరి పార్క్ సమీపంలోని రాళ్లలో చిక్కుకుంది.అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నెల మధ్య చిక్కుకోగా.. నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు రెండూ ధ్వంసం కావడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు.విషయం తెలిసిన నేవీ అధికారులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నౌకలో 15 మంది సిబ్బంది ఉన్నారు.విశాఖ-నర్సాపూర్ మధ్యన కాకినాడపైన ప్రాంతంలో తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఈ వాయుగుండం ధాటికి ఈ భారీ నౌక విశాఖ తీరానికి కొట్టుకు వచ్చింది.