తెలుగు చిత్ర పరిశ్రమలో పేరొందిన ఛాయాగ్రాహకుడు టి. సురేంద్రరెడ్డి. నందమూరిబాలకృష్ణ హీరోగా నటించిన 'అధినాయకుడు', 'శ్రీమన్నారాయణ', డా. రాజేంద్ర ప్రసాద్ ‘ఆనలుగురు', జగపతి బాబు 'పెళ్ళైన కొత్తలో' చిత్రాలతో పాటు 'జై బోలో తెలంగాణ', 'గరం', ' 10 క్లాస్', 'మైసమ్మ ఐసీఎస్' మొదలైన 50 చిత్రాలకు ఛాయాగ్రహణం సమకూర్చారు. అలాగే హిందీ లో 'రుద్రాక్ష్','టాంగో చార్లీ', కన్నడం లో విష్ణువర్థన్ హీరో గా 'కుంతీ పుత్ర' చిత్రాలకుకూడా ఫోటోగ్రఫీ అందించారు. ఆయనకు ఇద్దరు కవల పిల్లలు వినయ్ తంబిరెడ్డి, సమీర్దత్త. వీళ్లల్లో సమీర్ దత్త హీరోగా వినయ్ తంబిరెడ్డి దర్శకత్వం లో ఓ చిత్రం రూపొందింది. మూవీ బీస్ పతాకం పై నిర్మితమైన ఈ చిత్రం పేరు 'గల్లీ గ్యాంగ్'. తనయులు రూపొందించిన ఈ చిత్రానికి తండ్రి సురేంద్రరెడ్డి పర్యవేక్షణ చేయడం విశేషం.
దర్శకుడు వినయ్ తంబిరెడ్డి మాట్లాడుతూ - ''ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో మైండ్స్క్రీన్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్సు చేసాను. ఆ తరువాత 'జెస్సీ', 'కృష్ణ అండ్హిజ్ లీల', 'రాధాకృష్ణ' చిత్రాలకు దర్శకత్వం లో పని చేసాను. తెలంగాణ యాస తోపల్లెటూరి చిక్కటి ప్రేమకథగా కుమార్ మల్లారపు రాసిన స్క్రిప్ట్ ‘గల్లీ గ్యాంగ్' తో దర్శకునిగా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో అందరూ కొత్త వాళ్లే నటించారు. కానీ ఒక
ప్రత్యేక పాత్రను మాత్రం సీనియర్ హాస్య నటులైన జెన్నీ తోచేయించాం. 20 రోజుల పాటు గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో నటీ నటుల్ని ఎంపిక చేసి, వాళ్లకు వర్క్ షాప్ నిర్వహించాం. తెలంగాణ సాంస్కృతిక సమితి రాష్ట్ర సమన్వయ కర్తదయా నర్సింగ్ సహకారంతో రామగుండం, పెద్దంపేట్ గ్రామాల్లో 40 రోజుల పాటు షూటింగ్చేశాం. సాంకేతిక నిపుణులు కూడా అంతా కొత్త వారే. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకుతీసుకు వస్తాం’’అని తెలిపారు.