YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై విరుచుకుపడ్డ కొండచరియలు

ఇంద్రకీలాద్రిపై విరుచుకుపడ్డ కొండచరియలు

విజయవాడ, అక్టోబరు 13 
ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షం కారణంగా కొండపై నుంచి పెద్ద బండరాళ్లు కింద పడిపోయాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు టోల్ గేట్ దగ్గర నుంచి ఏలాంటి వాహనాలు పైకి వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో వాహనదారులు తిన్న ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు.. రోడ్డు పై పడిన రాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్లో నివాసాలపై కొండ చరియలు విరిగి పడి వ్యక్తి చనిపోయాడు. మట్టిలో కూరుకుపోయిన వ్యక్తి మట్టిని తొలగించి ఆస్పత్రికి తరలించినా దక్కని ఫలితం దక్కలేదు.మరోవైపు విజయవాడలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో విజయవాడతో పాటు జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లాలోనూ పంట పొలాలు నీటమునిగాయి.. బాపులపాడు మండలం కొత్తపల్లిలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరాయి. చాట్రాయి మండలం సోమవరం గ్రామలో కోళ్ల ఫారాలలో నీరు ప్రవేశించడంతో 5000 కోడి పిల్లలు చనిపోయాయి. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునురు, చాట్రాయి మండలాల్లో కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు నిండాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

Related Posts