కరోనాతో ముందు ఇంకా కష్టమే
న్యూడిల్లీ,
వ్యాక్సిన్ వస్తే పోతుందిలే అని, ఈ లోగానే పోతుందని అనుకుంటున్నాం కదా. కానీ కరోనా మూమెంట్స్ చూస్తుంటే ఈ లోపే ఇంకో రౌండ్ మీదడిపోయేలా ఉందంట. ప్రస్తుతానికి కరోనాని కేర్ చేయడం లేదు జనాలు. కేసుల సంఖ్య కూడా కంట్రోల్ లోనే ఉంది. తగ్గే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.ఇలా కానీ వెళ్తే.. ఇంకొన్నాళ్లలో వ్యాక్సిన్ వచ్చినా రాకపోయినా.. అవసరం లేదు అనేలా ఉన్నారు జనాలు. కరోనా వచ్చినా కూడా వేడినీళ్లు తాగి తగ్గించుకుంటాంలే అంటున్నారు. కానీ.. ఈ లోగా అది డీఎన్ఏ లు గట్రా మార్చుకుని ఇంకాస్త స్ట్రాంగ్ గా తయారయ్యి.. మళ్లీ అందరి మీదా పడే ఛాన్స్ కనిపిస్తోందంట. అలా గానీ వస్తే.. దాన్ని తట్టుకోవడం ఎవరి వల్లా కాదూ అంటున్నారు.. వరల్డ్ వైడ్ గా ఉన్న కరోనా నిపుణులు.అయితే మళ్లీ వస్తే డేంజర్ కానీ.. మళ్లీ రాకుండా ఇలా కంట్రోల్ అయితే మాత్రం ఎలాంటి గొడవా ఉండదట. రోగిని కాదు.. వ్యాధిపై యుద్ధం చేయాలి అనే మాటని జనాలు గట్టిగానే వంట పట్టించుకున్నట్లున్నారు. రోగితో యుద్దం ఎలా ఉన్నా.. వ్యాధితో మాత్రం బానే యుద్ధం చేస్తున్నారు. కరోనా వచ్చినా.. ఒక వారం రెస్టు దొరికింది అని ఇంట్లో కూర్చుని.. తగ్గింది అంటూ అందంగా ఆనందంగా తయారై బయటికి వస్తున్నారు. రోజూ శారీరక శ్రమ చేసే వాళ్లైతే లెక్క కూడా చేయడం లేదు. అంతే కాదు. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చినా రాకున్నా.. ఈ గండం గట్టెక్కితే చాలట. మాటి మాటికీ వచ్చేంత సీన్ కరోనాకి లేదంటున్నారు. కొన్నేళ్ల తర్వాత ఇది మనుషుల్ని ఏమీ చేయలేదని.. మనుషులు దాని కంటే బాగా ముదిరిపోతారని.. బాడీల్లో కరోనా కాళ్లిరగ్గొట్టే యాంటీ బాడీస్ రెడీ అవుతాయని అంచనా వేస్తున్నారు. ముందైతే ఈ గండం గట్టెక్కాలి.. మళ్లీ రెండో అటాక్ నుంచి కూడా తప్పించుకోవాలి అనేది వాళ్ల మాట.