YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

రాజధానిలో జోరుగా వ్యభిచారం..

రాజధానిలో జోరుగా వ్యభిచారం..

రాజధానిలో జోరుగా వ్యభిచారం.. టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టులే అధికంఅవకాశాలు తక్కువ కావడమే కారణం.. రాచకొండ కమిషనరేట్‌లో ఎక్కువ కేసులు

వ్యభిచార గృహాలను మూయించినా అంతే.. 

రాజధాని శివార్లతో పాటు నగరం నడిబొడ్డున కూడా హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇందులోనూ టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువగా పట్టుబడుతున్నారు. సినిమాలు, టీవీ షోలలో అవకాశాల కోసం ప్రయత్నించి, అవి ఎక్కువగా దొరక్కపోవడంతో సులభంగా డబ్బు సంపాదన కోసం వాళ్లు ఈ బాట పడుతున్నారని తెలుస్తోంది. 2017లో నమోదైన కేసుల్లో చాలావరకు సినిమా పరిశ్రమకు చెందినవాళ్లే దొరికేశారు. గత సంవత్సరం తాము దాదాపు 50 మంది జూనియర్ ఆర్టిస్టులను వ్యభిచార కూపం నుంచి కాపాడినట్లు పోలీసులు చెబుతున్నారు. వాళ్లంతా టాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకునేవారని, అలాగే టీవీ చానళ్లలోని డైలీ సీరియళ్లలో కూడా నటించేవారని.. కొంతకాలం తర్వాత అవకాశాలు తక్కువై ఇటువైపు వచ్చారని అంటున్నారు. ముందునుంచి పరిశ్రమలో ఉన్న పరిచయాలతో పాటు తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా వాళ్లు అనే పేరు ఉండటంతో దాన్ని ఈరకంగా ఉపయోగించుకుంటున్నారు. పోలీసులు గత సంవత్సరం దాదాపు వందకు పైగా రైడ్లు చేసి నగర శివార్లలో ఉన్న పలు వ్యభిచార గృహాలను మూయించేశారు. ఒక్క 2017 సంవత్సరంలోనే 40కి పైగా గృహాలు మూతపడ్డాయి.

అపార్టుమెంట్లలో వ్యవహారం..
నగరంలోని చాలా అపార్టుమెంట్లలో పక్క ఫ్లాట్‌లో ఏం జరుగుతోంతో పట్టించుకునే తీరిక కూడా ఎవరికీ ఉండటం లేదు. దాంతో గుట్టుచప్పుడు కాకుండా ఫ్లాట్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అలాగే ఎప్పటినుంచో ఉన్న లాడ్జీల వ్యవహారాన్ని కూడా పోలీసులు ఉక్కుపాదంతో అణిచేస్తున్నారు. గత సంవత్సరం తాము ఎనిమిది లాడ్జీలను మూయించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెబుతున్నారు. మనుషుల అక్రమ రవాణా అన్నది అచ్చంగా డిమాండు - సరఫరా సూత్రం మీదే ఆధారపడి ఉందని ఆయన అన్నారు. అందుకే ముందుగా డిమాండును తగ్గించడానికి తాము ప్రయత్నిస్తున్నామని, అప్పుడు సరఫరా దానంతట అదే తగ్గిపోతుందని చెప్పారు. అయితే.. మనుషుల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులు కోర్టు వరకు వెళ్తున్నా.. అక్కడ శిక్షలు పడటం మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. 2016 సంవత్సరంలో ఒక్క కేసులోనూ శిక్ష పడలేదు. ఇక 2017లో దాదాపు 70 శాతం కేసులు కోర్టులలో పెండింగులోనే ఉంటున్నాయి.

రాచకొండలో రచ్చరచ్చ
గత సంవత్సర కాలంలో నగర పరిధిలోని మూడు కమిషనరేట్లలో.. ఒక్క రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ చట్టం (పిటా) కింద కేసులు నమోదయ్యాయి. రాచకొండ పోలీసులు ఈ చట్టం కింద 82 కేసులు నమోదుచేయగా, సైబరాబాద్ పరిధిలో 78, హైదరాబాద్ పరిధిలో 60 కేసులు నమోదయ్యాయి. ఇక కొత్త సంవత్సరంలో కూడా రాచకొండ కమిషనరేట్‌లో వ్యభిచార ఘటనలు బాగానే బయటపడ్డాయి. కేవలం 20 రోజుల్లోనే 15 మంది నిందితులను అరెస్టుచేసి ఆరు కేసులు నమోదు చేసినట్లు రాచకొండ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. మనుషుల అక్రమ రవాణా, వ్యభిచారం లాంటి వ్యవహారాలను పూర్తిగా నియంత్రించేందుకు తాము స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ఆయన చెప్పారు. 

Related Posts