కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
హైద్రాబాద్,
కీసర మాజీ తహసిల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనను ఇటీవల ఏసీబీ అధికారుల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక ల్యాండ్ కేసులో కోటి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా నాగరాజును ఏసీీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనను కస్టడీకి తీసుకుని విచారించారు కూడా. అయితే ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు ఉన్న గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్ 53 ఎకరాలల్లోని 28 ఎకరాలకు సంబంధించి వేరొకరికి అనుకూలంగా వ్యవహరించి రెవెన్యూ రికార్డులను ట్యాపరింగ్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ నాగరాజు. కందాడి అంజిరెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. దాంతో ఆయనను విధుల నుంచి తప్పించారు ఉన్నతాధికారులు. ఈ కేసులో ఇప్పటికే కస్టడీకి తీసుకుని నాగరాజును ప్రశ్నించారు. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా పనిచేసిన నాగరాజు పెద్దఎత్తున చేతివాటం చూపించాడని రెవెన్యూ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.