YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కలకలం రేపుతున్న యడ్డీ నిర్ణయం

కలకలం రేపుతున్న యడ్డీ నిర్ణయం

కలకలం రేపుతున్న యడ్డీ నిర్ణయం
బెంగళూర్, 
ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీసుకున్న నిర్ణయం పార్టీలో కలకలం రేపుతుంది. ఉత్తర కర్ణాటకలో బలమైన నేతగా ఉన్న శ్రీరాములు శాఖ మార్పిడిపై కలకలం రేపుతుంది. యడ్యూరప్ప ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. మంత్రి వర్గ విస్తరణకు ముందు శాఖలను మార్చడంపై యడ్యూరప్ప వ్యూహం మరేదైనా ఉందా? అన్న సందేహాలు పార్టీ నేతల్లో తలెత్తుతున్నాయి.యడ్యూరప్ప ఉన్నట్లుండి శాఖల మార్పిడకి నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న శ్రీరాములును తప్పించి ఆయన స్థానంలో విద్యాశాఖ మంత్రి కె.సుధాకర్ కు అప్పగించారు. నిజానికి శ్రీరాములు తొలి నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిని కోరుతున్నారు. ఆయనకున్న బీసీ శాఖను కూడా తప్పించారు. శ్రీరాములుకు సాంఘిక సంక్షేమ శాఖను మాత్రమే అప్పగించారు. దీనిపై శ్రీరాములు ఆగ్రహంతో ఉన్నారు.తనను పక్కన పెట్టేందుకే యడ్యూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీరాములు ఉత్తర్ కర్ణాటకలో పార్టీకి బలమైన గాలి జనార్థన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తనకు ఈ శాఖ కూడా అవసరం లేదని శ్రీరాములు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కరోనాను నియంత్రించడంలో విఫలమయ్యారనే శ్రీరాములును తప్పించారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే శ్రీరాములును ఆరోగ్య శాఖ నుంచి తప్పించడం విపక్షాల చేతికి అస్త్రం చిక్కినట్లయింది.యడ్యూరప్ప మరోసారి అధికారంలోకి రాగానే గాలి జనార్థన్ రెడ్డి బ్యాచ్ ను దూరంపెడుతూ వస్తున్నట్లు కనపడుతుంది. శ్రీరాములు ఉప ముఖ్మమంత్రి పదవిని ఆశించినా ఆయనకు రాలేదు. అలాగే బళ్లారి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పదవిని కూడా శ్రీరాములును దూరం చేశారు. ఇప్పుడు ముఖ్యమైన వైద్య ఆరోగ్య శాఖ, బీసీ శాఖలనుంచి తప్పించడంతో శ్రీరాములు టార్గెట్ గా ఏదో జరుగుతుందన్న అనుమానాలు ఆయన వర్గం నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts