YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎల్ ఆర్ ఎస్ ద‌ర‌ఖాస్తుదారుల‌కు తీపి క‌బురు

ఎల్ ఆర్ ఎస్ ద‌ర‌ఖాస్తుదారుల‌కు తీపి క‌బురు

ఎల్ ఆర్ ఎస్ ద‌ర‌ఖాస్తుదారుల‌కు తీపి క‌బురు
హైద్రాబాద్, 
ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2015 సంవత్సరంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌లోగా పాత దరఖాస్తులను, కొత్త నిబంధనల ప్రకారం క్లియర్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ మెమో నెంబర్ లో ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ గడువు తేదీని మరో 10 రోజుల పా టు ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈనెల 15వ తేదీ వరకు ఎల్‌ఆర్‌ఎస్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో దీనిపై త్వరలో అధికారికంగా ప్ర భుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, లే ఔట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్)కు ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ అడ్డంకిగా మారిన నేపథ్యంలో గడువును పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం.నెలరోజులుగా ఎల్‌ఆర్‌ఎస్‌కు నెలరోజులుగా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే ఎల్‌ఆర్‌ఎస్ మలిదశ ప్రక్రియకు కీలకమైన సాఫ్ట్‌వేర్ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలన, రుసుం తీసుకోవడం తదితరాలకు ఆటంకం ఏర్పడి క్రమబద్ధీకరణ ప్రక్రియ ముందుకుసాగడం లేదు. దీనిపై ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈనేపథ్యంలోనే గడువు పొడిగింపుపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రభు త్వం భావిస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం వరకు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో కలిపి సుమారు 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతా ల్లో 10 లక్షలకు దరఖాస్తుల స్వీకరణ అనంతరం వాటిని పరిశీలిస్తూ ఆర్జీదారుల నుంచి రుసుం తీసుకోవాల్సి ఉండగా, దానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ ప్రస్తుతం అందుబాటులో లేదు.సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నన్స్ (సిజిజి) కసరత్తు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలకు పైగా, పట్టణాల్లో 4 లక్షల దాకా
అనధికార ప్లాట్లు, అక్రమ లే ఔట్లకు సంబంధించిన స్థలాలు ఉన్నట్టుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది క్రమబద్ధీకరణ కోసం  దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా అది తీసుకోవడం లేదు. సోమవారం నాటికి గ్రామ పంచాయితీల్లో 5,19,170 దరఖాస్తులు, మున్సిపాలిటీల్లో 5,15,493, కార్పొరేషన్‌లలో 2,42,278 దరఖాస్తులు వచ్చాయి.
 

Related Posts